ePaper
Monday, September 14, 2026
📄 ePaper

విషాదంలో ఉన్న కుటుంబానికి అండగా కంబాల

📰 Generate e-Paper Clip

తక్షణ సాయంగా రూ.5 వేల నగదు, 25 కిలోల బియ్యం అందజేత..

ఎన్ వి ఆర్ టీవీ, తెలుగు పొలిటికల్ పవర్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ ఇంచార్జ్ ఆలస్యం విరన్ జులై 30 2026: తూర్పుగోదావరి జిల్లా, జగ్గంపేట నియోజకవర్గం, గోకవరం మండలం, తంటికొండ గ్రామానికి చెందిన రాయి చిన్నారావు , భార్య రాయి నాగమణి ఇటీవలే మృతి చెందారు. ఈ విషయాన్ని విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ జగ్గంపేట నియోజకవర్గం బీఎల్ఏ-1 కంబాల శ్రీనివాసరావు దృష్టికి తీసుకు వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. మృతురాలి కుటుంబ సభ్యులకు తక్షణ సహాయంగా రూ.5,000 నగదు, 25 కిలోల బియ్యం అందించాలని నిర్ణయించారు. ఆ సహాయాన్ని మృతురాలి కుమారులు రాయి నాగబాబు, రాయి వీరబాబు లకు అందజేయాలని రామసేన సభ్యులు, బీజేపీ నాయకులకు సూచించారు. ఆయన ఆదేశాల మేరకు తుమ్మల బుజ్జి, పాపోలు గనిరాజు, పదిలం చక్రరావు, మంగరాతి పద్దరాజు, నెల్లి శ్రీను బాధిత కుటుంబాన్ని పరామర్శించి.. రూ.5,000 నగదు మరియు 25 కిలోల బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని, అవసరమైన ప్రతి సహాయం అందిస్తానని భరోసా ఇచ్చినట్లు తెలిపారు. కంబాల శ్రీనివాసరావు మానవతా దృక్పథాన్ని కుటుంబ సభ్యులు అభినందిస్తూ, ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

Latest Articles

బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులుగా గన్నమనేని కిరణ్ కుమార్ 

  తెలంగాణ రాష్ట్రం తరుపున బిసిఐ ప్రతి నిధిగా సేవలు అందించ బోతున్న...

గణేష్ చతురుద్ది వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి

  పట్టణ, మండల ప్రజలకు జూపల్లి దంపతుల శుభాకాంక్షలు మట్టి గణపతులను పూజిద్దాం.. పర్యావరణాన్ని...

Related Articles

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డులో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులు.పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్...

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ పి...

కాంగ్రెస్ బలోపేతానికి సోషల్ మీడియా కీలక ఆయుధం

*కాంగ్రెస్ బలోపేతానికి సోషల్ మీడియా కీలక ఆయుధం**పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దిన పత్రిక పొలిటికల్ న్యూస్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు...
error: Content is protected !!