ePaper
Friday, June 5, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిజనగణన జనాభా సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలి – తహసిల్దార్ మల్లికార్జున్

జనగణన జనాభా సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలి – తహసిల్దార్ మల్లికార్జున్

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 05 2026: పెద్దమందడి మండలం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జనగణన జనాభా సర్వే కార్యక్రమాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని పెద్దమందడి తహసిల్దార్ మల్లికార్జున్ ఎనిమరేటర్లకు సూచించారు. మండల పరిధిలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ… జనాభా లెక్కల సేకరణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కోరారు. ప్రతి ఇంటిని సందర్శించి కుటుంబ వివరాలు, జనాభా గణాంకాలను కచ్చితంగా నమోదు చేయాలని ఆయన తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పనకు జనగణన గణాంకాలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. సర్వే ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలను వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎనిమరేటర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించి జనాభా సర్వేను త్వరితగతిన పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వ లక్ష్య సాధనకు సహకరించాలని తహసిల్దార్ మల్లికార్జున్ కోరారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ఎనిమరేటర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!