– మొన్న జరిగిన కుక్క దాడిలో చిన్నారి మొహమ్మద్ ఖాన్ కోలుకోక ముందే మరోసారి ఆ చిన్నారిపై పిచ్చికుక్కలు దాడి,
– కొత్తకోట మున్సిపల్ సిబ్బంది పాలకులు గాని నిమ్మకు నీరేత్తకుండా ఉండడం చాలా సిగ్గుచేటు ,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 06 జూన్ 2026: కొత్తకోట మున్సిపాలిటీ లోని 15 వార్డులో తీవ్రమైన కుక్కల దాడి, మొన్న జరిగిన కుక్క దాడిలో చిన్నారి మొహమ్మద్ ఖాన్ కోలుకోక ముందే మరోసారి ఆ చిన్నారిపై పిచ్చికుక్కలు దాడి చేసిన పట్టించుకోని కొత్తకోట మున్సిపల్ సిబ్బంది పాలకులు గాని నిమ్మకు నీరేత్తకుండా ఉండడం చాలా సిగ్గుచేటు అని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంలో వారు మాట్లాడుతూ శనివారం 15 వార్డులో గల కుక్కలు చిన్నపిల్లలపై దాడికి పాల్పడితే ప్రమాదవశాత్తు ఆ చిన్నారి యొక్క తండ్రి అక్కడ ఉండడంతో ఆ చిన్నారి ప్రమాదవశాత్తు బయటపడ్డాడు మొదటగా ఆ చిన్నారి పై దాడి చేసిన కుక్క తానంతపుతానే నోట్లో నుంచి ఏదో రకమైన వాంతులు చేసుకొని, సాయంత్రం వరకు అదే వీధిలో మరణించింది. అది గమనించి డాక్టర్లకు వివరించగా మొహమ్మద్ ఖాన్ కు తగిన చికిత్స చేసాము కానీ వచ్చే ఐదేళ్ల వరకు ఆ బాబును కంటికి రెప్పలాగా కాపాడుకోవాలని చెప్పాలని తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంత జరిగినా కూడా కొత్తకోట మున్సిపల్ సిబ్బంది కానీ పాలకులు గాని నిమ్మకు నీరేత్తకుండా ఉండడం చాలా సిగ్గుచేటుగా ఉందని , చిన్నారులకు ప్రాణాలు పణంగా పెట్టి భయభ్రాంతులకు గురై బతకాల్సి వస్తుంది తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ కుక్కల విషయంలో బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే కి కూడా ఫిర్యాదు చేశారని తెలిపారు ఎమ్మెల్యే ఆదేశాలు ఇచ్చాన కొత్తకోట నాయకులు ఏదో చేశామని, సాధించామని వాట్సాప్ లలో పోస్ట్లు పెట్టుకున్నారని,అది కాదండి మీరు చేయాల్సింది వీధుల్లో ఉండే చిన్నారులకు ప్రాణాంతకంగా ఉన్న పిచ్చి కుక్కల నుండి విముక్తి కలిగించేలా మున్సిపల్ సిబ్బందితో చర్చలు జరిపి మొదట ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరుతున్నామని, లేదా వీధికో పదిమంది యువకులను కలిసి స్వయంగా తామే ఖర్చులు భరించి వీధి కుక్కలను తరిమేసే కార్యక్రమాన్ని మొదలుపెడతామని కొత్తకోట మున్సిపల్ కమిషనర్ కి చైర్మన్ లకు పాలక మండలీ సభ్యులకు కొత్తకోట యువత నుండి మీకు తెలియజేస్తున్నామని వారు తెలిపారు.

