ePaper
Saturday, September 19, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

ఢిల్లీ లో జస్టిస్ కె. జి. బాలకృష్ణన్ కమిషన్ ని కలిసిన బహుజన రక్షణ సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్,దళిత క్రైస్తవ నాయకుడు కాశీ సతీష్ కుమార్ మాదిగ,

 

 

జూన్ 8 : పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

దళిత క్రైస్తవులు మరియు దళిత ముస్లింలకు షెడ్యూల్డ్ కుల హోదా పరిశీలన కమిషన్,

దళిత క్రైస్తవులకు షెడ్యూల్డ్ కుల హోదా మరియు రిజర్వేషన్ ప్రయోజనాల కల్పన గురించి వినతి పత్రం ఇచ్చిన కాశీ సతీష్ కుమార్,

భారత రాజ్యాంగం కల్పించిన సమానత్వం, సామాజిక న్యాయం మరియు మత స్వేచ్ఛ సూత్రాల ప్రకారం దళిత క్రైస్తవులకు న్యాయం చేయవలసిందిగా ఈ వినతి పత్రం సమర్పించడం జరిగింది,

చారిత్రకంగా చూస్తే కనుక

1936 షెడ్యూల్డ్ కులాల ఆర్డర్ ప్రకారం భారత క్రైస్తవులను షెడ్యూల్డ్ కులాల జాబితా నుండి మినహాయించారు.

అనంతరం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ప్రకారం జారీ చేయబడిన 1950 రాజ్యాంగ (షెడ్యూల్డ్ కులాలు) ఆర్డర్ ద్వారా షెడ్యూల్డ్ కుల హోదాను కేవలం హిందూ మతస్థులకు మాత్రమే పరిమితం చేశారు. ఫలితంగా షెడ్యూల్డ్ కులాల నుండి క్రైస్తవ మతంలోకి మారిన వారు తమ ఎస్సీ హోదాను మరియు రిజర్వేషన్ హక్కులను కోల్పోయారు.

1956లో సిక్కు మతస్థులను, 1990లో బౌద్ధ మతస్థులను షెడ్యూల్డ్ కులాల జాబితాలో చేర్చినప్పటికీ, దళిత క్రైస్తవులు మరియు దళిత ముస్లింలు ఇప్పటికీ వెలివేయబడి ఉన్నారు.

గతంలో క్రైస్తవ మిషనరీలు విద్యాసంస్థలు, ఆసుపత్రులు, హాస్టళ్లు మరియు సంక్షేమ కేంద్రాలను నిర్వహించడం ద్వారా దళిత క్రైస్తవులకు విద్యా, సామాజిక మరియు ఆర్థిక సహకారం అందించేవారు. అందువల్ల ఆ కాలంలో రిజర్వేషన్ల అవసరం అంతగా కనిపించలేదు.

అయితే కాలక్రమేణా అనేక మిషనరీ సంస్థలు స్థానిక యాజమాన్యాల చేతుల్లోకి వెళ్లడం, ప్రభుత్వ జోక్యాలు పెరగడం వలన దళిత క్రైస్తవులకు లభించిన అవకాశాలు తగ్గిపోయాయి. ఫలితంగా వారు విద్య, ఉపాధి మరియు సామాజిక అభివృద్ధిలో వెనుకబడ్డారు.

మత మార్పిడి జరిగినప్పటికీ కుల వివక్ష పూర్తిగా తొలగిపోలేదు. దళిత క్రైస్తవులు ఇప్పటికీ వివాహాలు, సమాధి స్థలాలు, సామాజిక సంబంధాలు మరియు గ్రామీణ జీవనంలో కుల వివక్షను ఎదుర్కొంటున్నారు.

ఈ వెనుకబాటుతనాన్ని గుర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దళిత క్రైస్తవులను బీసీ-సి (BC-C) వర్గంలో చేర్చి పరిమిత రిజర్వేషన్ కల్పించింది. అయితే ప్రస్తుత రిజర్వేషన్ వారి జనాభా మరియు సామాజిక పరిస్థితులకు సరిపోదు.

రాజ్యాంగ పరమైన అంశాలు

ఆర్టికల్ 14 – సమానత్వ హక్కు.

ఆర్టికల్ 15 – వివక్ష నిషేధం.

ఆర్టికల్ 16 – ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాలు.

ఆర్టికల్ 25 – మత స్వేచ్ఛ హక్కు.

ఒక వ్యక్తి తన మతాన్ని మార్చుకున్నందుకు రాజ్యాంగ పరిరక్షణలను కోల్పోవడం సామాజిక న్యాయ సూత్రాలకు విరుద్ధం.

ప్రస్తుత పరిస్థితి దళిత క్రైస్తవులు ఇప్పటికీ,కుల వివక్షను ఎదుర్కొంటున్నారు.ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు.విద్యా అవకాశాలలో వెనుకబడి ఉన్నారు.

నిరుద్యోగ సమస్యలను ఎదుర్కొంటున్నారు.రాజకీయ ప్రాతినిధ్యం తక్కువగా ఉంది.కేవలం మత మార్పిడి కారణంగా ఎస్సీ రిజర్వేషన్ ప్రయోజనాలకు దూరమయ్యారు. దళిత క్రైస్తవులకు షెడ్యూల్డ్ కుల హోదాను పునరుద్ధరించాలి.1950 రాజ్యాంగ (షెడ్యూల్డ్ కులాలు) ఆర్డర్‌లోని పేరా 3ను తొలగించి మత ఆధారిత పరిమితిని రద్దు చేయాలి.

బీసీ-సి రిజర్వేషన్ శాతాన్ని గణనీయంగా పెంచాలి.

దళిత క్రైస్తవులకు ప్రత్యేక రిజర్వేషన్ వర్గాన్ని ఏర్పాటు చేయాలి.

ఎస్సీ వర్గీకరణలో ప్రత్యేక ఉపవర్గం (SC-E) ఏర్పాటు చేసి తగిన రిజర్వేషన్ కల్పించాలి.

ఆర్టికల్ 25 ప్రకారం మత స్వేచ్ఛను వినియోగించినందుకు ఎవరూ తమ సామాజిక న్యాయ హక్కులను కోల్పోకూడదని డిమాండ్ చేశారు.

దళిత క్రైస్తవులు చారిత్రకంగా కుల వివక్షకు గురైన వర్గం. మత మార్పిడి జరిగినప్పటికీ వారి సామాజిక, ఆర్థిక మరియు విద్యా వెనుకబాటుతనం కొనసాగుతోంది. అందువల్ల వారికి షెడ్యూల్డ్ కుల హోదా, రిజర్వేషన్ ప్రయోజనాలు మరియు రాజ్యాంగ పరిరక్షణలు కల్పించడం సామాజిక న్యాయం మరియు రాజ్యాంగబద్ధ బాధ్యత అని అన్నారు,

గౌరవనీయ కమిషన్ దళిత క్రైస్తవులకు న్యాయం చేసే విధంగా తగిన సిఫార్సులు చేయవలసిందిగా కోరుతూ కాశీ సతీష్ కుమార్ మాట్లాడడం జరిగింది,

Latest Articles

ఇంటింటికి రేషన్ పంపిణీ విధానాన్ని రద్దు చేసిన ప్రభుత్వం పై హైకోర్టు విచారణ

పొలిటికల్ పవర్  తెలంగాణప్రతినిధి* ఆంధ్రప్రదేశ్YSRCP ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటింటికి రేషన్ పంపిణీ...

  తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించిన సర్పంచ్ కొర్సా రమేష్జూలూరుపాడు...

కళాకారులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం రవీంద్రభారతిలో నిరసన

పొలిటికల్ పవర్ ప్రతినిధి హైదరాబాద్* సమస్య: గత మూడేళ్లుగా వివిధ...

సమగ్ర నివేదికతో మండల సర్వసభ్య సమావేశం కి హాజరవ్వాలి ఎంపీపీ చల్లా గంగాదేవి వెంకటనారాయణ

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

వేముల వెంకట్రావును పరామర్శించిన చేతివృత్తుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు తోలేటి శ్రీకాంత్

విజయవాడ (చిట్టినగర్): పొలిటికల్ పవర్ ప్రతినిధివిజయవాడ చిట్టినగర్ నివాసి, బీసీ...

వినాయక మండపాన్ని సందర్శించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేతి వృత్తుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు తోలేటి శ్రీకాంత్

వినాయక మండపాన్ని సందర్శించినశుక్రవారం రోజు విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామం...

Related Articles

  తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించిన సర్పంచ్ కొర్సా రమేష్జూలూరుపాడు సెప్టెంబర్ 17. పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 తెలుగు న్యూస్:/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు...

కాబోయే నూతన దంపతులను ఆశీర్వదించిన ఆదర్శ కుటుంబం జగనన్న దంపతులు

మాజీ ఎంపీ ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి కుమారుడి వివాహ ఎంగేజ్‌మెంట్‌కు హాజరైన శ్రీ వైయస్‌ జగన్‌నీనా–ఇషాన్‌లను ఆశీర్వదించిన శ్రీ వైయస్‌ జగన్‌ దంపతులుబెంగళూరులో జరిగిన మాజీ ఎంపీ ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి కుమారుడు ఇషాన్‌...

విదేశీ పర్యటనకు అనుమతి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి యూరప్పర్యటనకు నాంపల్లి ప్రత్యేక సీబీఐ కోర్టుఅనుమతి ఇచ్చింది. ఆదాయానికి మించినఆస్తుల కేసు దర్యాప్తు నేపథ్యంలో విదేశాలకువెళ్లేందుకు కోర్టు అనుమతి అవసరంకావడంతో జగన్ పిటిషన్...
error: Content is protected !!