చేయూత అందించిన టి.జె.ఎఫ్ జర్నలిస్ట్ యూనియన్
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్ ఖమ్మం జూన్ 10, ప్రభాత వార్త: వి ఫైవ్ కోఆర్డినేటర్, ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ఇన్చార్జ్ కే. వెంకటేశ్వర్లు ( కే. వి) కుమారునికి శస్త్ర చికిత్స కోసం తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీజేఎఫ్) జిల్లా కమిటీ చేయూత అందించింది. కే. వి. కుమారునికి తీవ్ర అనారోగ్య సమస్య తలెత్తి వెన్నుముక్కకు హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స పొందుతున్న సమాచారం తెలుసుకున్న టీజేఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి చిర్రా రవి లు బుధవారం ఖమ్మంలో జర్నలిస్టు కెవికి 10 వేల రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా వారు స్పందిస్తూ.. టీయూడబ్ల్యూజే (టి జే ఎఫ్) జిల్లా కమిటీ బాధిత జర్నలిస్టు కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
కష్టకాలంలో ఉన్న జర్నలిస్టులకు ఆర్థిక సహకారాన్ని ఇప్పటికే అనేకమందికి తమ యూనియన్ పక్షాన సహాయ సహకారాలు అందించి ఆదుకోవడం జరిగిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మందుల ఉపేందర్, ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు, కోశాధికారి బిక్కీ గోపి, నాయకులు కళ్యాణ్, జక్కుల వెంకటరమణ, సుధాకర్, సాయి తదితరులు పాల్గొన్నారు.
