ePaper
Wednesday, June 17, 2026
📄 ePaper
Homeతెలంగాణమీనాక్షి నటరాజన్ నామినేషన్ వివాదం: రేవంత్ రెడ్డిపై హరీష్ రావు సంచలన ఆరోపణలు

మీనాక్షి నటరాజన్ నామినేషన్ వివాదం: రేవంత్ రెడ్డిపై హరీష్ రావు సంచలన ఆరోపణలు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ హైదరాబాద్, జూన్ 11: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా ఉన్న మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ అంశం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వ్యవహారంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టీ. హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు తెలంగాణ కాంగ్రెస్ నాయకులే కారణమని మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ మంత్రి వ్యాఖ్యానించారని హరీష్ రావు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తే మీనాక్షి నటరాజన్‌కు వెన్నుపోటు పొడిచారని తమకు సమాచారం అందిందన్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని రేవంత్ రెడ్డికి సన్నిహితుడైన నాయకుడికి ఇవ్వాలని కోరగా, మీనాక్షి నటరాజన్ అంగీకరించలేదని, అదే కారణంతో ఆమెకు వ్యతిరేకంగా వ్యవహరించారని హరీష్ రావు ఆరోపించారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ స్థాయిలో ఉన్న నాయకురాలికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే, సాధారణ కాంగ్రెస్ కార్యకర్తల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మొత్తం వ్యవహారంపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. అయితే, హరీష్ రావు చేసిన ఈ ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ లేదా రేవంత్ రెడ్డి నుంచి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం ఈ అంశం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!