ePaper
Wednesday, June 17, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిఉపాధి హామీ పనుల్లను అక్కస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

ఉపాధి హామీ పనుల్లను అక్కస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 11 2026: పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనుల్లను వనపర్తి జిల్లా కలెక్టర్ గురువారం రోజు ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా గ్రామంలో పామీరెడ్డి పల్లె నుండి బలిజపల్లి వరకు వ్యవసాయ పొలాలకు పోయే బాటల కోసం గ్రామ రైతుల అందరి ఏకాభిప్రాయం ప్రకారంగా ఉపాధి హామీ పనుల్లో బాటలను మంజూరు చేయించడం జరిగింది. అట్టి బాటల పనితీరు ఏ విధంగా జరుగుతుందో అని ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ వచ్చే స్వయంగా ఉపాధి హామీ కూలీలతో మాట్లాడడం జరిగింది. బాట పనితీరు చూసి ఉపాధి హామీ సిబ్బందిని ప్రశంసనీయడం జరిగింది. ఇదే విధంగా గ్రామంలో ఇంకా రెండు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి ఉమాదేవి అడిషనల్ కలెక్టర్ కీమ్యానాయక్ పెద్దమందడి ఎమ్మార్వో మరియు ఎంపీడీవో గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం ఉపసర్పంచ్ రాములమ్మ మాజీ ఎంపిటిసి ఇందిరా లక్ష్మారెడ్డి గ్రామ యువకులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!