ePaper
Wednesday, June 17, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

*గూడెం సత్య దేవుని ఆలయానికి ఉప ముఖ్యమంతి బట్టి విక్రమార్కరాక*

తేదీ:13-06-2026

పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్.మంచిర్యాల జిల్లా

దండేపల్లి మండలం గూడెం గుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం కు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క మరియు రాష్ట మంత్రులు కొండా సురేఖ,జూపల్లి కృష్ణారావు,దుద్దిళ్ల శ్రీధర్ బాబు,అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గార్లచే గోదావరి పుష్కర నిధుల ద్వారా 58 కోట్ల రూపాయలచే గూడెం ఆలయ పునర్నిర్మాణం మరియు అభివృది పనులకు అలాగే నీటి పారుదల శాఖ ద్వారా 75 కోట్ల రూపాయలతో గూడెం,ద్వారక, గుడిరేవు, మోదెల, మినీ లిఫ్ట్ లకు శంకు స్థాపన చేయించే కార్యక్రమానికి వస్తున్నారు అని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తెలిపారు అని జిల్లా కాంగ్రెస్ నాయకులు గడ్డం త్రిమూర్తి అన్నారు.ఈ కార్యక్రమని కి పార్టీలకు అతింతంగా ప్రజలు,రైతులు,వ్యాపార వేత్తలు, భక్తులు పాత్రికేయులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరినారూ. దశాబ్ధాల కాలంగా అభివృద్ధికి నోచుకొని శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రత్యేక చొరవతో భారీగా నిధులు మంజూరు కావడం చాలా సంతోషంగా ఉందనీ ఈ ప్రాంత ప్రజలు అంటున్నారు అని అన్నారు. ఎన్నో ఏండ్ల నుండి చివరి ఆయా కట్టుకు సాగు నీరు అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు అని,గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నాలుగు లిఫ్ట్ మంజూరు చేసి రైతు బాంధవుడు అయ్యిండు అని అన్నారు.దండేపల్లి మండలం రెబ్బన పల్లి లో యాంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, 200 కోట్లు ద్వారక ఉన్నత పాఠశాల కు హాస్టల్ , దండేపల్లి మండల ఉన్నత పాఠశాల కు 15 కోట్లు లింగపూర్ మోడల్ స్కూల్ అభివృధి, కస్తూరిబా పాఠశాల అభివృధి,అన్ని ప్రభుత్వ పాఠశాల ల అభివృధి, నిధులు మంజూరు కావడం అదే విధంగా మామిడిపల్లి ఉన్నత పాఠశాలకు హాస్టల్ మంజూరు కోసం ప్రతిపాదనలు పంపించి నందుకు ఎమ్మెల్యే కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము అని అన్నారు.దండేపల్లి లక్షెట్టి పేట మండల రైతాంగం కోసం లక్సెట్టిపేటలో 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం నిలువ కోసం 12 కోట్ల రూపాయలతో గోదాంల నిర్మాణం పనులు చేపట్టారని అన్నారు.నియోజక వర్గాన్ని విద్యా వైద్యం,వ్యవసాయం లో రాష్ట్రం లోనే మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కి ఈ ప్రాంత ప్రజలు రుణ పడి ఉంటామని అన్నారు.ఈ కార్యక్రమం లో పార్టీ మండల అధ్యక్షులు అక్కల వెంకటేశార్లు,మాజీ ఎంపీటీసీ ముత్యాల శ్రీనివాస్,సర్పంచ్ రాజేశ్వర్ నాయక్ ,ఉప సర్పంచ్ సిరికొండ నవీన్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ కాటుకూరి రాజన్న,మండల నాయకులు దేవ లక్ష్మణ్,అశోక్ నాయక్,రాజేష్, కొండా గోపాల్, బొలిశెట్టి సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!