– చనిపోయిన పోలీసు కుటుంబాలకు అన్ని వేళలా అండగా నిలుస్తాం,
జిల్లా ఎస్పీ.సునిత రెడ్డి ఐపీఎస్,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పి ఎన్ 9టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 11.2026: పోలీసు కార్పస్ విడో ఫండ్ పోలీసు కుటుంబాలలో ఆర్థిక భరోసా కల్పిస్తూ, సంక్షేమానికి కొత్త వెలుగులు నింపుతోందని వనపర్తి జిల్లా ఎస్పీ. సునిత రెడ్డి ఐపీఎస్ తెలిపారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో, జనవరిలో బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా వనపర్తి జిల్లా పానుగల్ పోలీస్టేషన్లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తు మరణించిన రాందాస్ భార్య లావణ్యకు జిల్లా ఎస్పీ. సునిత రెడ్డి ఐపీఎస్ పోలీసు విడో కార్పస్ ఫండ్ కింద రూ. లక్ష రూపాయల చెక్‌ను అందజేశారు. ఈ సందర్భంలో జిల్లా ఎస్పీ. సునిత రెడ్డి ఐపీఎస్ మాట్లాడుతూ… విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబాలకు పోలీసుశాఖ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం ద్వారా వారికి అందాల్సిన అన్ని రకాల ప్రయోజనాలను సాధ్యమైనంత త్వరగా అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరణించిన పోలీసు కుటుంబ సభ్యుల స్థితిగతులను తెలుసుకుని, వారి పిల్లల విద్యా అభ్యసన వివరాలను ఆరా తీశారు. విధి నిర్వహణలో మరణించిన పోలీస్ కుటుంబాల సంక్షేమం పోలీసుశాఖ ప్రధాన బాధ్యతగా భావిస్తూ, వారికి నిరంతరం సహకారం అందిస్తామని పేర్కొన్నారు. కుటుంబానికి రావాల్సిన మిగిలిన బెనిఫిట్స్ కూడా త్వరితగతిన అందేలా కృషి చేయాలని కార్యాలయ ఏ.ఓ. కీ జిల్లా ఎస్పీ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కార్యాలయం ఏ.ఓ. సునందన, సూపరింటెండెంట్ ఇంతియాజ్, మరణించిన ఏఎస్సై, రాందాస్ భార్య లావణ్య, కూతురు నిఖిత తదితరులు పాల్గొన్నారు.


