ePaper
Wednesday, June 17, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్పైప్‌లైన్ పగిలి వృథాగా పోతున్న మంచినీరు

పైప్‌లైన్ పగిలి వృథాగా పోతున్న మంచినీరు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్/పీఎన్9 తెలుగు న్యూస్: బ్రహ్మంగారిమఠం, జూన్ 17 బ్రహ్మంగారిమఠం మండలంలోని తోటపల్లి గ్రామంలో రామాలయం వెనుక భాగంలో భీమమటం–మల్లెపల్లి గ్రామాలకు సరఫరా చేసే ఫిల్టర్ వాటర్ పైప్‌లైన్ పగిలి రెండు రోజులుగా మంచినీరు వృథాగా ప్రవహిస్తోంది. పైప్‌లైన్ లీకేజీ కారణంగా పెద్ద మొత్తంలో తాగునీరు వృథా అవుతుండగా, సంబంధిత కాంట్రాక్టర్ మరియు అధికారులు ఇప్పటివరకు స్పందించలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి వృథాతో పాటు గ్రామాలకు సరఫరా అయ్యే తాగునీటి పరిమాణం తగ్గే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వేసవి కాలంలో నీటి కొరత నెలకొనే పరిస్థితుల్లో ఇలాంటి నిర్లక్ష్యం తగదని స్థానికులు పేర్కొంటున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పైప్‌లైన్‌కు మరమ్మతులు చేపట్టి నీటి వృథాను అరికట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమస్యను అత్యవసరంగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!