ePaper
Tuesday, September 15, 2026
📄 ePaper

గ్రామాల్లో అభివృద్ధి పనులు నాణ్యతతో, గడువులోపు పూర్తి చేయాలి

📰 Generate e-Paper Clip

– అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్యా నాయక్,

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 16. 2026.గ్రామాల్లో అభివృద్ధి పనులు నాణ్యతతో, గడువులోపు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్యా నాయక్ అన్నారు.వనపర్తి మండలంలోని నాగమ్మ తండా గ్రామ పంచాయతీని జిల్లా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ మంగళవారం సందర్శించి పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్మాణంలో ఉన్న గ్రామ పంచాయతీ భవనం, వీవో భవనాల పనులను పరిశీలించి నిర్మాణ పనులు నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని ఏఈ (పీఆర్) అధికారికి సూచించారు. పనుల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని, నిర్మాణ నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. అనంతరం గ్రామ నర్సరీని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్, నర్సరీ నిర్వహణను మరింత మెరుగుపరచాలని సూచించారు. మొక్కల సంరక్షణ, వాటి పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఫీల్డ్ ఆఫీసర్, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. పర్యావరణ పరిరక్షణలో నర్సరీల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ), ఎంపీడీఓ, ఎంపీఓ, పంచాయతీ కార్యదర్శి, ఏఈ (పీఆర్) తదితర అధికారులు పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్‌తో పాటు గ్రామస్తులు హాజరయ్యారు.

Latest Articles

సెయింట్ జోసెఫ్ స్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

మందలపల్లిలో సహస్ర హీరో షోరూం ఘన ప్రారంభం – ముఖ్య అతిథిగా తాటి వెంకటేశ్వర్లు

సహస్ర హీరో షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుపొలిటికల్...

నాగపట్నం ప్రార్థన మందిరంలో మద్దిశెట్టి సామేలు ప్రత్యేక ప్రార్థనలు

ప్రజల సంక్షేమం కోసం ప్రార్థించిన ఎన్‌సీపీ-ఎన్వైసీ నాయకులుపొలిటికల్ పవర్,నాగపట్నం, తమిళనాడు,సెప్టెంబర్14: తమిళనాడులోని...

జిల్లా పోలీసు కార్యాలయంలో మట్టి గణనాథునికి ఘనంగా పూజలు నిర్వహించిన జిల్లా పోలీసులు

– జిల్లా ప్రజలకు,పోలీసులకు ఆయురారోగ్యాలు కలగాలని గణనాథునికి ప్రార్థనలు, ప్రజా రక్షణలో...

బీమా కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ...

Related Articles

నీ శరీరం మట్టితో చేసిన ఆలయం… నీ ఆత్మ అందులో వెలిగే దీపం

– లోపల శాంతి ఉంటే, బయట ప్రపంచం అందంగా ఉంటుంది, లోపల కలత ఉంటే స్వర్గం కూడా నరకంలా అనిపిస్తుంది,– అయినా ఓ మానవ నాది అనే మాయలో జీవిస్తున్నావు, కాలం ముందు...

error: Content is protected !!