పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో జూన్ 21 2026: మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సిద్ధిల తిరుమలరావు అధ్యక్షతన శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ మరియు సూపర్వైజర్ మెడికల్ అండ్ హెల్త్ వర్కర్స్ అసోసియేషన్ నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు కుర్రి సైదయ్య మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న సుమారు 18 వేల మంది కార్మికులు తక్కువ వేతనాలతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ పోషణ కష్టసాధ్యంగా మారడంతో పలువురు ఉద్యోగాలను విడిచిపెట్టి ఇతర మార్గాలు వెతుక్కుంటున్నారని తెలిపారు. గత 10 నుంచి 20 సంవత్సరాలుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలందిస్తున్న కార్మికులు, పుట్టిన శిశువు నుంచి మార్చురీ వరకు ప్రతి విభాగంలో అనేక ప్రమాదకర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్నప్పటికీ, సరైన రక్షణ పరికరాలు, ఉద్యోగ భద్రత, ప్రమాద బీమా వంటి సౌకర్యాలు కల్పించడం లేదని విమర్శించారు. 2022లో విడుదలైన జీవో నెం.60 ప్రకారం నెలకు రూ.15,600 వేతనం చెల్లించాల్సి ఉండగా, ఈపీఎఫ్, ఈఎస్ఐ మినహాయింపుల తర్వాత ప్రతి కార్మికుడికి రూ.12,093 రావాల్సి ఉందన్నారు. అయితే కాంట్రాక్ట్ ఏజెన్సీలు కార్మికుల శ్రమను దోపిడీ చేస్తూ రూ.9,500 నుంచి రూ.11,500 వరకు మాత్రమే వేతనాలు చెల్లిస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం, వైద్యశాఖ ఉన్నతాధికారులు కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి, ప్రతి కార్మికుడిని ఐఎఫ్ఎంఎస్లో విలీనం చేసి నెలకు రూ.26,000 ఫిక్స్డ్ వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ, సూపర్వైజర్ కార్మికులతో కలిసి భారీ స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీఎస్ రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులు మాతంగి అనిల్ కుమార్, రాష్ట్ర కమిటీ సహాయ కార్యదర్శి ఉబ్బ రమణక్క, భద్రాద్రి కొత్తగూడెం హాస్పిటల్ అధ్యక్షులు అనిల్, కొత్తగూడెం మెడికల్ కాలేజీ అధ్యక్షులు శ్రావణ్, జీజీహెచ్ కమిటీ సహాయ కార్యదర్శులు డి. గంగా, పవన్ తదితరులు పాల్గొన్నారు. మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రి ఎస్పీఎస్ నూతన కమిటీ గౌరవాధ్యక్షులు: సిద్ధిల తిరుమలరావు అధ్యక్షులు: చెన్నం వీరస్వామి ప్రధాన కార్యదర్శి: కోనేటి స్వాతి ఉపాధ్యక్షులు: సంధ్య, నరేష్, ఎస్. జ్యోతి, జి. రాణి సహాయ కార్యదర్శులు: వి. వెంకటేశ్వర్లు, ఆర్. మనీ, జి. వినోద్ కోశాధికారి: కేదార్ ప్రచార కార్యదర్శులు: ఎస్కే రియాజ్, ప్రణయ్ కమిటీ సభ్యులు: నాగమణి, ప్రమీల, మీనా కుమారి, ముత్తయ్య, వెంకటేశ్వర్లు తదితరులు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఆసుపత్రి కార్మికులు పాల్గొని నూతన కమిటీకి అభినందనలు తెలిపారు.
బెడ్‌సైడ్ కార్మికులకు నెలకు రూ.26,000 కనీస వేతనం ఇవ్వాలి: ఎస్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు కుర్రి సైదయ్య
0
87
Most Popular
- Advertisment -


