ePaper
Saturday, September 12, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిఎస్‌ఐఆర్ సర్వేపై పూర్తి అవగాహనతో ఓటర్ జాబితా సవరణ

ఎస్‌ఐఆర్ సర్వేపై పూర్తి అవగాహనతో ఓటర్ జాబితా సవరణ

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 25 2026: పెద్దమందడి, జూన్ 25: ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) సర్వేపై పూర్తి అవగాహనతో పెద్దమందడి మండలంలోని చీలకటోనిపల్లి గ్రామంలో ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం చేపట్టారు. బీఎల్‌వో జి. మంజుల ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించి, జాబితాలో అవసరమైన మార్పులు, చేర్పులు నిర్వహించారు. ఈ సందర్భంగా గురువారం బాజ శేఖర్ కుటుంబానికి సంబంధించిన ఓటర్ జాబితాను సవరించడంతో పాటు గ్రామ సర్పంచ్ ఎం. అశ్విత రమేష్ కుటుంబానికి సంబంధించిన ఓటర్ జాబితాను కూడా సవరించారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో సక్రమంగా నమోదు కావడం, తప్పులు సరిదిద్దడం లక్ష్యంగా ఈ ప్రక్రియ కొనసాగుతున్నట్లు బీఎల్‌వో తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, సిబ్బంది మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!