ePaper
Sunday, August 2, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిఅంబరానంటిన జననేత డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి పుట్టినరోజు సంబరాలు 

అంబరానంటిన జననేత డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి పుట్టినరోజు సంబరాలు 

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 28 2026: వనపర్తి నియోజకవర్గ అభివృద్ధి ప్రజా సంక్షేమం కోసం అలుపెరుగని పోరాటంలా అనునిత్యం శ్రమిస్తూ, నిత్యం ప్రజా క్షేత్రంలో ప్రజల కోసం పరితపించే ప్రజా నాయకుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తన సొంత గృహం నందు కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. అభిమానులు మాట్లాడుతూ… డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి ప్రభుత్వం పాఠశాల, ప్రభుత్వ కళాశాలలో, అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఎం ఎస్ సి, మలేషియా దేశంలో పీహెచ్ డి, ఉస్మానియా యూనివర్సిటీ లో ఎల్.ఎల్.బి ఉన్నత చదువులు చదివి డాక్టర్ రేట్ పొందారని తెలిపారు. వనపర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్ లో గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా నిబద్ధతతో పనిచేశారని తెలిపారు. వనపర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశారని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వనపర్తి గడ్డపై 41 మంది ఎమ్మెల్యేలతో సంతకాలు పెట్టించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీకి వినతి పత్రం ఇచ్చారని ఆయన కృషివల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంఏఐసిసి కార్యదర్శి గా నియమించి, తమిళనాడు, పుడుచ్చేరి అనేక రాష్ట్రాలకు ఇన్చార్జిలుగా అంకిత భావంతో పనిచేసే కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంబడే ప్రగతి భవన్ ప్రజాభవన్ గా చేసి నిరుపేదల సమస్యలు తెలుసుకొని సమస్యలను పరిష్కరించే విధంగా వారంలో మంగళవారం, శుక్రవారం అంకిత భావంతో పనిచేస్తూ నిరుపేదల సమస్యలను పరిష్కరిస్తున్నారని తెలిపారు. డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి భవిష్యత్తులో ఉన్నత పదవులు పొందాలని ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీమాజీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్, వనపర్తి మండల్ సింగల్ విండో అధ్యక్షుడు సహదేవుడు, గోపాల్ పేట్ మండల అధ్యక్షుడు నరహరి, వనపర్తి పట్టణ ప్రధాన కార్యదర్శి బాబా, వనపర్తి మండల్ ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షుడు ఎత్తం చరణ్ రాజ్, సీనియర్ నాయకులు మన్యం యాదవ్, ద్వార పోగు విజయబాబు, సిరివాటిసురేష్, నందిమల్ల రామ్, యుగంధర్ రెడ్డి, రామ్ జి నాయక్, సత్యం, కర్ణాకర్ రెడ్డి, బాల్ రాజు, శ్రీను, పెద్దమందడి మండల్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ గట్టు రాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!