ePaper
Saturday, September 12, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్కడపఎంపీడీవో రిటైర్డ్ ఫంక్షన్ లో మిగిలిన భోజనం పంపిణీ 

ఎంపీడీవో రిటైర్డ్ ఫంక్షన్ లో మిగిలిన భోజనం పంపిణీ 

📰 Generate e-Paper Clip

ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బి యస్ నారాయణరెడ్డి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ వైయస్సార్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్ జూన్ 30 2026: మార్కాపురం జిల్లా గిద్దలూరు మండల అభివృద్ధి అధికారి శేషగిరిరావు రిటైడ్ పొందిన సందర్భంగా ఘనంగా రిటైర్మెంట్ ఫంక్షన్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో అత్యంత రుచికరమైనటువంటి భోజనాలు ఏర్పాటు చేయగా అందులో భోజనాలు మిగిలాయని పంచాయతీ సెక్రెటరీలు తిరుమలరెడ్డి భూతేశ్వర్ రెడ్డి బి యస్ నారాయణరెడ్డి కి తెలిపారు వెంటనే ఏరువ రమణారెడ్డి సహాయంతో స్థానిక రైల్వే స్టేషన్ దగ్గర మిగిలిన భోజనాన్ని పంపిణీ చేయడం చాలా అదృష్టంగా భాగ్యంగా భావిస్తున్నామని ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బి యస్ నారాయణరెడ్డి సంఘ సేవకులు ప్రథమ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఫౌండేషన్, జి హెచ్ ఆర్ ఏ సి సి పి సి ఐ మానవ హక్కుల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు వారు తెలిపారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమని మహానుభావులు చెప్తూ ఉంటారు. అందుకే ఒక్క మెతుకు కూడా వృధా కాకుండా భోజనాన్ని పంపిణీ చేయడంతో ఎంతోమంది ఆకలితో ఉన్న అన్నార్తులకు కడుపు నింపడం చాలా అదృష్టం అన్నారు. నాకు చాలు అనే పదం ఏమైనా ఉంది అంటే అది అన్నమేనని అన్నారు. భోజనాలు వృధా కాకుండా పంపిణీ చేయాలని సమాచారం అందించిన అధికారులకు హృదయపూర్వక ధన్యవాదములు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నారు. ఎలాంటి శుభకార్యాలలో అయిన భోజనాలు మిగిలితే ఈ 9441932390 9959760906 కు సమాచారం అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏరువ రమణారెడ్డి పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!