ePaper
Saturday, September 12, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిప్రజల ఆరోగ్యమే మహాభాగ్యంగా భావించి తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలందిస్తున్న ప్రతి వైద్యుడు...

ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యంగా భావించి తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలందిస్తున్న ప్రతి వైద్యుడు దేవుడే

📰 Generate e-Paper Clip

–జాతీయవైద్యదినోత్సవసందర్భంగా సహృదయ సమితి ఆధ్వర్యంలో వైద్యులకు సన్మానం,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూలై 02. 2026.
ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యంగా భావించి తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలందిస్తున్న ప్రతివైద్యుడుదేవుడేనని,జాతీయవైద్యదినోత్సవసందర్భంగా సహృదయ సమితి ఆధ్వర్యంలో వైద్యులకు సాలువలుకప్పిఘనంగాసన్మానించారు.బుధవారం జాతీయవైద్యదినోత్సవసందర్భంగావనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం,ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లో ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యంగా భావించి, తమప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలందిస్తున్న ప్రతి వైద్యుడికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. వైద్యులు  ఆసియ బేగం,  శ్రావణి , లక్ష్మీ , మంజుశ్రీ ,  నిహారిక,  నవ్య ,  సుజన , వైద్య సిబ్బంది సమీ బిన్ అలి లను సన్మానించి స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈకార్యక్రమంలో మాజీ ఎంపీపీ గుంత మౌనిక మల్లేష్, కొత్తకోట కౌన్సిలర్ ముంత మంజుల రామకృష్ణ యాదవ్, మాజీ సర్పంచ్ ఎద్దుల లావణ్య నాగేష్, మాజీ మార్కెట్ డైరెక్టర్ భాగ్యలక్ష్మి ఎల్ఐసి కృష్ణ గౌడ్, మహంకాళి శిరీష, సునీత ప్రభుత్వ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!