ePaper
Saturday, September 12, 2026
📄 ePaper
Homeతెలంగాణఖమ్మంప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులకు ఘన సన్మానం

ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులకు ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

డాక్టర్స్ డే సందర్భంగా సేవామూర్తులకు అభినందనలు

వాసవి క్లబ్ ఆధ్వర్యంలో శాలువాలతో సత్కారం

పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట టౌన్ రిపోర్టర్ (వడితే గణేష్ జూలై 02) అశ్వారావుపేట పట్టణ పరిధిలోడాక్టర్స్ డే సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలందిస్తున్న వైద్యులను ఘనంగా సన్మానించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో వైద్యులు అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తిస్తూ పూలమాలలు వేసి, శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ, వైద్య వృత్తి అత్యంత గొప్పదని, కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు సేవలందించిన వైద్యుల సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో వైద్యులు నిరంతరం కృషి చేస్తున్నారని ప్రశంసించారు. వైద్యులు మాట్లాడుతూ… ప్రజల ఆరోగ్యమే తమ ప్రధాన లక్ష్యమని, మరింత అంకితభావంతో సేవలందిస్తామని తెలిపారు. అనంతరం డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యక్రమంలో పాల్గొన్న వారు వారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ జోన్ చైర్మన్ జల్లిపల్లి దేవరాజు, పలువురి విలేకరులు రాయల పోలయ్య, సరిదేరాజశేఖర్, పరిటాల రాంబాబు, రామ్ సాయి, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది డాక్టర్లు వైద్య నిపుణులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!