ePaper
Monday, September 14, 2026
📄 ePaper

*బలభద్రపురంలో ఘనంగా వైఎస్సార్ 77వ జయంతి వేడుకలు*

📰 Generate e-Paper Clip

*బలభద్రపురంలో ఘనంగా వైఎస్సార్ 77వ జయంతి వేడుకలు*

పొలిటికల్ పవర్ జాతీయ తెలుగుదినపత్రిక అండ్ పిఎన్9 టివి అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి జూలై 8:

బిక్కవోలు: తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి 77వ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. గ్రామ వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు కొవ్వూరి వెంకటరామారెడ్డి (కోట రాము) ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గ్రామంలోని వంతెన వద్ద మరీయు సోసైటి వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

అనంతరం కేక్ కట్ చేసి ప్రజలకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి ప్రజా సంక్షేమానికి ప్రతీకగా నిలిచిన మహానేత అని కొనియాడారు. రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, 108 అంబులెన్స్, 104 వైద్య సేవలు, జలయజ్ఞం వంటి పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపారని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు చేపట్టిన చారిత్రాత్మక పాదయాత్ర ఆయనకు ప్రజలతో విడదీయరాని అనుబంధాన్ని ఏర్పరిచిందని, ఆయన ఆశయాలు, ఆలోచనలు నేటికీ సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయని అన్నారు.

వైఎస్సార్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ప్రజాసేవకు అంకితభావంతో పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రామ వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు కొవ్వూరి వెంకటరామారెడ్డి (కోటారాము), సబ్బేళ్ల సుజాత వీరరాఘవరెడ్డి (ఎంపీటీసీ-1), మేడపాటి ఆనంద్‌రెడ్డి (ఎంపీటీసీ-2), మాజీ సాప్ డైరెక్టర్ గుబ్బల ఆలేఖ్య లాజర్, మాజీ సర్పంచ్ కర్రి సత్యనారాయణరెడ్డి, సొసైటీ మాజీ అధ్యక్షులు సబ్బేళ్ల వీరవెంకట సత్యనారాయణరెడ్డి, బీసీ నాయకులు ఎల్ల బుచ్చిలింగం, లిడియా గ్రెస్, గొర్రిపూడి శ్రీను, నల్లమిల్లి వెంకటకృష్ణారెడ్డి (పూసరెడ్డి), కోటాని రాంబాబు, కొనాల హైమావతి రామకృష్ణారెడ్డి, నల్లమిల్లి రత్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే వైఎస్సార్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై జయంతి వేడుకలను విజయవంతం చేశారు.

Latest Articles

బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులుగా గన్నమనేని కిరణ్ కుమార్ 

  తెలంగాణ రాష్ట్రం తరుపున బిసిఐ ప్రతి నిధిగా సేవలు అందించ బోతున్న...

గణేష్ చతురుద్ది వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి

  పట్టణ, మండల ప్రజలకు జూపల్లి దంపతుల శుభాకాంక్షలు మట్టి గణపతులను పూజిద్దాం.. పర్యావరణాన్ని...

అధికారంలో ఉండి కాంగ్రెస్‌ ధర్నాలు విడ్డూరం

  రాజకీయంగా ఎదుర్కోలేకే నిరసనలకు దిగుతున్నారు బీఆర్‌ఎస్‌ నాయకుడు అల్వాల వెంకట్ రెడ్డిపొలిటికల్ పవర్...

Related Articles

వినాయక చవితి వేడుకల్లో డీజేలకు నో!

 అనుమతి లేకుండా డీజేలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు బిక్కవోలు మండలంలో పోలీసుల అవగాహన సమావేశం బిక్కవోలు: వినాయక చవితి పండుగను ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు బిక్కవోలు పోలీసులు ప్రత్యేక అవగాహన...

error: Content is protected !!