*మహిళా రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా పైకాన్ని మహిళా సంఘాల అప్పులో బ్యాంకర్లు జమ చేయడాన్ని ఖండించిన కొత్వాల*
*కొత్వాల చొరవతో రైతు భరోసా పైకం పంపిణీ*
11 జులై 2026. ఎన్ వి ఆర్ న్యూస్ తెలుగు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఇన్చార్జ్ ఆలస్యం విరన్ . కాంగ్రెస్ ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రైతు ఖాతాల్లోకి జమ చేస్తున్న రైతు భరోసా పైకాన్ని రైతులకు అందజేయాలని *డీ.సీ.ఎం.ఎస్ మాజీ చైర్మన్, రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, పాల్వంచ సహకార సంఘం అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు* అన్నారు. పాల్వంచ మండల పరిధిలోని మల్లారం గ్రామ మహిళా రైతుల స్వయం సహాయక గ్రూపుల్లోని ఖాతాల్లోకి *రైతు భరోసా పైకం* వేశారు. అట్టి రైతు భరోసా పైకాన్ని *బ్యాంకర్లు* *రైతుల అప్పు* క్రింద జమ చేసుకొని రైతులకు పైకం ఇవ్వడం లేదు. ఈ విషయాన్ని రైతులు *కొత్వాల* దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన *కొత్వాల* వెంటనే *ఎస్.బి.ఐ కిన్నెరసాని శాఖ మేనేజర్ వెంకటరెడ్డిని* కలసి బ్యాంకు సిబ్బందితో మాట్లాడి మహిళా రైతులకు రైతు భరోసా పైకాన్ని ఇప్పించారు. ఈ సందర్భంగా *కొత్వాల* మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకం క్రింద ఒక ఎకరానికి *12 వేల రూపాయలు* పెట్టుబడి సాయం కింద అందజేస్తున్నదని బ్యాంకర్లు వాటిని తమ బ్యాంక్ అప్పుల క్రింద జమ చేసుకోవడం సరికాదన్నారు. మహిళా సంఘాలు తీసుకున్న రైతు భరోసా పైకాన్ని సద్వినియోగం చేసుకోవాలని *కొత్వాల* అన్నారు.
*కొత్వాలకు మహిళా సంఘాల సభ్యులు ప్రశంసలు* :
రైతు భరోసా పైకాన్ని బ్యాంకులు ఇవ్వకపోవడంతో మహిళా రైతులు ఆందోళన చెంది విషయాన్ని *సొసైటీ చైర్మన్ కొత్వాల దృష్టికి* తీసుకుపోగా ఆయన వెంటనే స్పందించి బ్యాంకర్లతో మాట్లాడి రైతు భరోసా పైకాన్ని ఇప్పించటంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. సమస్యను దృష్టికి తీసుకెళ్లగానే స్పందించిన *కొత్వాల చొరవ పట్ల మహిళా రైతులు హర్షం వ్యక్తం చేశారు కొత్వాలను ప్రశంసించారు* .
ఈ కార్యక్రమంలో పాల్వంచ మండలం పరిధిలోని *మల్లారం గ్రామ మహిళా రైతులు, పాల్వంచ సొసైటీ డైరెక్టర్ బుడగం రామ్మోహన్ రావు, కాంగ్రెస్ నాయకులు యర్రంశెట్టి ముత్తయ్య, కొండం వెంకన్న, వై. వెంకటేశ్వరరావు* తదితరులు పాల్గొన్నారు


