ePaper
Saturday, September 12, 2026
📄 ePaper
Homeఅంతర్జాతీయంకాంగ్రెస్ బలోపేతానికి సోషల్ మీడియా కీలక ఆయుధం

కాంగ్రెస్ బలోపేతానికి సోషల్ మీడియా కీలక ఆయుధం

📰 Generate e-Paper Clip

*కాంగ్రెస్ బలోపేతానికి సోషల్ మీడియా కీలక ఆయుధం*

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దిన పత్రిక పొలిటికల్ న్యూస్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*

  1. * జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ నందు సోషల్ మీడియా సమావేశానికి విచ్చేసిన రాష్ట్ర సోషల్ మీడియా చైర్మెన్ పెట్టేం నవీన్ గారు*

*రాష్ట్ర సోషల్ మీడియా చైర్మన్ పెట్టేం నవీన్‌కు పమ్మి అశోక్ అభినందనలు*

ఖమ్మం: *తెలంగాణ రాష్ట్ర సోషల్ మీడియా చైర్మన్‌గా నియమితులైన శ్రీ పెట్టేం నవీన్ను జిల్లా కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి పమ్మి అశోక్ మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.*

ఈ సందర్భంగా *పమ్మి అశోక్ మాట్లాడుతూ..* కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సోషల్ మీడియా నేడు అత్యంత శక్తివంతమైన వేదికగా మారిందని, ప్రత్యర్థి పార్టీలు చేసే అసత్య ప్రచారాలను తిప్పికొడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి కార్యకర్త ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.

2022లో రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా పెట్టేం నవీన్, జిల్లా కాంగ్రెస్ కమిటీ సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా పమ్మి అశోక్ పనిచేస్తూ, సోషల్ మీడియా వేదికగా పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీ సంస్థాగత బలోపేతానికి కృషి చేసినట్లు పమ్మి అశోక్ తెలిపారు.

ప్రస్తుతం పెట్టేం నవీన్ గారికి రాష్ట్ర సోషల్ మీడియా చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం మరింత దూకుడుగా పనిచేసి బీజేపీ, బీఆర్ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారాలకు వాస్తవాలతో సమాధానం చెప్పే బలమైన డిజిటల్ వ్యవస్థగా రూపుదిద్దుకోవాలని ఆకాంక్షించారు.

కాంగ్రెస్ కార్యకర్తలే పార్టీకి బలం.. సోషల్ మీడియానే ప్రజల్లోకి పార్టీ గొంతుకను తీసుకెళ్లే ప్రధాన వేదిక అని పేర్కొన్న పమ్మి అశోక్, రాబోయే రోజుల్లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సోషల్ మీడియాను సమర్థవంతంగా వినియోగించి పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్ వీరపురం రామలక్ష్మణ్, ఖమ్మం సిటీ కోఆర్డినేటర్ ఏలూరు రవి, వైరా నియోజకవర్గానికి చెందిన తేజావత్ స్వామి, తెళ్ళూరి వీరయ్య, భూక్యా వెంకన్న, గోపి, ఇలప్రోలు వెంకటప్పయ్య తదితరులు పాల్గొన్నారు.

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!