ePaper
Tuesday, July 28, 2026
📄 ePaper
Homeతెలంగాణఖమ్మంప్రయత్నం ఫలించింది.. గురుకుల విద్యార్థినులకు సీట్లు కేటాయింపు

ప్రయత్నం ఫలించింది.. గురుకుల విద్యార్థినులకు సీట్లు కేటాయింపు

📰 Generate e-Paper Clip


ఖమ్మం, జూలై 16 ( పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి ):
వి. వెంకటాయపాలెం గ్రామానికి చెందిన ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థినులకు గురుకుల బాలికల కళాశాలల్లో ప్రథమ సంవత్సరం ఇంటర్మీడియట్ ప్రవేశాలు కల్పించేందుకు చేసిన ప్రయత్నం సఫలమైంది.
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి కిలారు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో, ఖమ్మం లోక్‌సభ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి గారి ద్వారా ఖమ్మం జిల్లా గురుకుల జోనల్ అధికారి అపర్ణ కి వినతిపత్రం సమర్పించారు. వినతిని సానుకూలంగా పరిశీలించిన జోనల్ అధికారి అపర్ణ అర్హులైన విద్యార్థినులకు గురుకుల కళాశాలల్లో సీట్లు కేటాయించారు.
ఈ సందర్భంగా కిలారు అనిల్ కుమార్ మాట్లాడుతూ, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం సమాజం పట్ల ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా విద్య, ఉపాధి, సంక్షేమ అంశాల్లో ప్రజలకు అండగా నిలుస్తానని తెలిపారు.
ఈ విజయంపై ఖమ్మం జిల్లా స్వేరో నెట్వర్క్ అధ్యక్షుడు శ్రీకాంత్ స్వేరో కిలారు అనిల్ కుమార్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల పేద విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ఆయన సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. అలాగే విద్యార్థినుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వెంటనే స్పందించి సీట్లు కేటాయించిన ఖమ్మం జిల్లా గురుకుల జోనల్ అధికారి అపర్ణ కి, ఈ ప్రక్రియకు సహకరించిన ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
“విద్య కోసం చేసే ప్రతి చిన్న ప్రయత్నం… ఒక కుటుంబానికే కాదు, సమాజ భవిష్యత్తుకే వెలుగునిస్తుంది” అని శ్రీకాంత్ స్వేరో పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!