ePaper
Monday, September 14, 2026
📄 ePaper

బిక్కవోలులో “కనెక్ట్ యూత్” అవగాహన కార్యక్రమం*

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ జాతీయ తెలుగుదినపత్రిక అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి,
బిక్కవోలు, జూలై:18
తూర్పుగోదావరిజిల్లా పోలీసు సూపరింటెండెంట్ నరసింహ కిషోర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు, ఈస్ట్ జోన్ డీఎస్పీ విద్య సూచనలతో, అనపర్తి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సుమంత్ ఆధ్వర్యంలో బిక్కవోలు పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ రవిచంద్ర కుమార్ రంగాపురం గ్రామంలోని శ్రీ రామాలయం ప్రాంగణంలో “కనెక్ట్ యూత్” అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రొజెక్టర్ ద్వారా మాదకద్రవ్యాల (డ్రగ్స్) వినియోగం వల్ల కలిగే అనర్థాలు, రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం, నాలుగు చక్రాల వాహనదారులు సీటు బెల్ట్ వినియోగించడం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రమాదాల గురించి ప్రజలకు వివరించారు.
అదేవిధంగా మహిళల భద్రత, మహిళలపై జరిగే నేరాల నివారణ, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులను సంప్రదించాల్సిన అవసరం, శక్తి యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని అత్యవసర సహాయం పొందే విధానం, దాని ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.
యువత మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, రోడ్డు భద్రతా నియమాలను కచ్చితంగా పాటించాలని, మహిళల పట్ల గౌరవభావంతో వ్యవహరిస్తూ సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు.
ఈ అవగాహన కార్యక్రమంలో సుమారు 100 మంది గ్రామస్థులు పాల్గొని, కార్యక్రమాన్ని ఆసక్తిగా వీక్షించారు.

Latest Articles

బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులుగా గన్నమనేని కిరణ్ కుమార్ 

  తెలంగాణ రాష్ట్రం తరుపున బిసిఐ ప్రతి నిధిగా సేవలు అందించ బోతున్న...

గణేష్ చతురుద్ది వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి

  పట్టణ, మండల ప్రజలకు జూపల్లి దంపతుల శుభాకాంక్షలు మట్టి గణపతులను పూజిద్దాం.. పర్యావరణాన్ని...

Related Articles

వినాయక చవితి వేడుకల్లో డీజేలకు నో!

 అనుమతి లేకుండా డీజేలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు బిక్కవోలు మండలంలో పోలీసుల అవగాహన సమావేశం బిక్కవోలు: వినాయక చవితి పండుగను ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు బిక్కవోలు పోలీసులు ప్రత్యేక అవగాహన...

error: Content is protected !!