ePaper
Tuesday, July 28, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిఎమ్మెల్యే పదవి అనేది ఒక హోదా మాత్రమేఎవరికి ఏ అవసరం వచ్చినా నాకు నేరుగా ఫోన్...

ఎమ్మెల్యే పదవి అనేది ఒక హోదా మాత్రమేఎవరికి ఏ అవసరం వచ్చినా నాకు నేరుగా ఫోన్ చేసి మాట్లాడవచ్చు మీ సమస్యను చెప్పుకోవచ్చు

📰 Generate e-Paper Clip

–  మనమందరం కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులం ఎవరు మనస్పర్ధలకు అవకాశం ఇవ్వకండి ఎలాంటి  గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించకండి,
– నేను మీలా ఒక సాధారణ,సామాన్య కార్యకర్తనే,
దేవరకద్ర శాసన సభ్యులు జి.మధుసూదన్ రెడ్డి,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్-9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 22. 2026.
ఏదైనా సమస్య ఉంటే కుటుంబ సభ్యుల కూర్చుని మాట్లాడుకుందాం గ్రామాల్లో సమస్యలు ఏమైనా ఉంటే మండల స్థాయి నాయకులు,మండల పార్టీ అధ్యక్షులతో చర్చించి పరిష్కరించుకోవాలని
దేవరకద్ర శాసన సభ్యులు జి.మధుసూదన్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ కొందరు అవకాశవాద రాజకీయ నాయకులు గుంటనక్కల్లాకాచుకొనికూర్చున్నారు.అసమ్మతి నాయకులను కార్యకర్తలను ప్రలోభపెట్టేప్రయత్నంచేస్తున్నారు.అలాంటివాళ్ళనినమ్మకండని,ఎవరుఅధైర్యపడకండని,2034వరకుప్రజాప్రభుత్వంఅధికారంలోఉంటుంది. దేవరకద్ర గడ్డపై మరోసారి మీ అందరి ఆశీర్వాదంతో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం మని,భగవంతుని దయతో ఇంకా ఉన్నతహోదాతో మీకు సేవచేసుకునేఅవకాశంకచ్చితంగావస్తుందని,
నాకువేరేవ్యాపకాలువేరేవ్యాపారాలులేవుప్రజాసేవయే నా అంతిమ లక్ష్యం అని అన్నారు.నన్ను శాసనసభ్యులుగా గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు మంచి చేయడమేనాజీవితఆశయంమని,నేను నియోజకవర్గంలో ఉంటే మీ మధ్యలో ఉంటా హైదరాబాదులో ఉంటే నియోజకవర్గ అభివృద్ధిసంక్షేమంకోసంసెక్రటేరియట్,లోమంత్రులను,ఉన్నతాధికారులను కలిసి అభివృద్ది పనులపై చర్చించి నిధులు సమకూర్చే పనిలో ఉంటానని, నేను రాజకీయాల్లోకి వచ్చింది నిస్వార్ధంగా ప్రజాసేవ చేయాలని లక్ష్యంతో వచ్చా న్యాయవాద వృత్తిలో డబ్బు సంపాదించుకునే అవకాశం ప్రజాసేవయే పరమావధిగా భావించి న్యాయవాద వృత్తిని వదిలి మీ కోసం మీ ముందుకు వచ్చానని ఆయన తెలిపారు.
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!