ePaper
Tuesday, July 28, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్కడపపుల్లారెడ్డి పల్లె దళితులకు స్మశానం దగ్గర కర్మకాండ చేసుకొనుటకు మంచినీటి సౌకర్యం వెంటనే ఏర్పాటు చేయాలి....

పుల్లారెడ్డి పల్లె దళితులకు స్మశానం దగ్గర కర్మకాండ చేసుకొనుటకు మంచినీటి సౌకర్యం వెంటనే ఏర్పాటు చేయాలి. సిపిఐ…డిమాండ్

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక /పిఎన్9టీవీ తెలుగు న్యూస్ రిపోర్టర్. ఎం. ప్రసాద్ రావు. కలసపాడు. కడప జిల్లా. బద్వేల్ నియోజకవర్గం లోని కలసపాడు మండలంలోని పుల్లారెడ్డి పల్లె గ్రామంలో దళితులకు స్మశాన వాటిక వద్ద కర్మకాండ కార్యక్రమాలు నిర్వహించుకొనుటకు మంచినీటి వసతి లేదని

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ గుడిమె .సునీల్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కలసపాడు మండలం. పుల్లారెడ్డి పల్లె గ్రామం లో సుమారు350 దళిత కుటుంబాలు కలిగిన అతిపెద్ద ఎస్సికుల గ్రామం. ఐనప్పటికీ , ఇక్కడ ప్రజలు చనిపోయిన తర్వాత స్మశాన స్థలాన్ని తీసుకొని పోవుటకు రహదారి అయితే ఉన్నది. అయితే అక్కడ కాలకృత్యాలు తీర్చుకునేందుకు, నీటి వసతి, అలాగే మహిళలు వస్త్రాలు మార్చుకునేందుకు, మరియు విధవరాలు అయ్యేందుకు ,తగిన రూమును కూడా ఏర్పాటు చేయాలని, పంచాయతీ అధికారులను వారు అనేక మార్లు అడిగారు. ఇక్కడ ప్రజలు ఎన్నోసార్లు అధికారులకు చెప్పినప్పటికీ ఎవరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదనీ ఏదైనాకర్మ కార్యక్రమం చేసుకోవాలంటే వాళ్ళ సొంత డబ్బులు పెట్టి వాటర్ తెప్పించుకొని కార్యక్రమం చేసుకోవడం.. ఇక్కడ మహిళలకు.. స్మశానం దగ్గర ఎటువంటి సౌకర్యాలు లేకపోయేసరికి… వారు ఆరు బయట.. స్థానాలు చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉన్నది.. మహిళలు కష్టాలను చూసి ఆయన ఆవేదన చెందారు. వెంటనే ఉన్నతాధికారులు ఈ సమస్యను పరిష్కరించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో. గుడిమే గుర్రప్ప. గుడిమీ మోహన్. గుడిమే ప్రకాష్. గుడిమే. బాలస్వామి. గుడిమె. తరుణ్. గుడిమే. ఇన్నయ్య. గుడిమీ చిన్న గురప్ప.గుడిమే. శేఖర్. గుడిమె. జేమ్స్. ఓబులాపురం. ప్రసాదు .రవి. ఓసూరి ఇశ్రాయేలు. గుడిమే. తి మోతి. గుడిమే .పుల్లయ్య గ్రామ ప్రజలు అన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!