ePaper
Friday, July 31, 2026
📄 ePaper
Homeతెలంగాణతెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మహిళా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌కు లైంగిక వేధింపుల ఫిర్యాదు

తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మహిళా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌కు లైంగిక వేధింపుల ఫిర్యాదు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ జులై 31 2026: హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ తనను అదే విభాగానికి చెందిన ఓ సెక్షన్ ఆఫీసర్ లైంగికంగా వేధిస్తున్నారని రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన చీఫ్ సెక్రటరీ ప్రాథమికంగా పరిశీలించిన అనంతరం, సంబంధిత సెక్షన్ ఆఫీసర్‌పై గతంలో కోర్టు ధిక్కరణతో పాటు ఇతర ఆరోపణలు కూడా ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయనను సంబంధిత శాఖ నుంచి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ (GAD) కు సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ప్రభుత్వం నిబంధనల ప్రకారం తదుపరి విచారణ చేపట్టే అవకాశం ఉంది. అధికారిక విచారణ అనంతరం పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం వుంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!