ePaper
Saturday, August 1, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిలోకమాన్య బాల గంగాధర్ తిలక్ సేవలు చిరస్మరణీయం -ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

లోకమాన్య బాల గంగాధర్ తిలక్ సేవలు చిరస్మరణీయం -ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 01 2026: భారత స్వాతంత్ర్య సమరంలో ప్రజల్లో జాతీయ చైతన్యాన్ని రగిలించి, స్వరాజ్య సాధనకు జీవితాంతం పోరాడిన మహనీయుడు లోకమాన్య బాల గంగాధర్ తిలక్ సేవలు భారత జాతి ఎన్నటికీ మరువలేనివని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. లోకమాన్య బాల గంగాధర్ తిలక్ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు

“స్వరాజ్యం నా జన్మహక్కు – దానిని సాధించుకొని తీరుతాను” అనే నినాదంతో స్వాతంత్ర్య ఉద్యమానికి నూతన స్ఫూర్తిని నింపిన మహోన్నత నాయకుడు తిలక్ అని కొనియాడారు. దేశభక్తి, ధైర్యం, త్యాగం, జాతీయ స్పూర్తికి ప్రతీకగా నిలిచిన ఆయన భావజాలం తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, ఆశయాలను ప్రతి భారతీయుడు స్ఫూర్తిగా తీసుకొని దేశాభివృద్ధి, సమాజ శ్రేయస్సు కోసం కృషి చేయడం ద్వారా వారికి నిజమైన నివాళి అర్పించిన వారమవుతామని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!