ePaper
Saturday, August 1, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్సిఐటియు రైతు వ్యవసాయ కార్మిక సంఘం బూర్గంపాడు మండల సదస్సు సారపాక సిఐటియు కార్యాలయంలో జరిగింది. 

సిఐటియు రైతు వ్యవసాయ కార్మిక సంఘం బూర్గంపాడు మండల సదస్సు సారపాక సిఐటియు కార్యాలయంలో జరిగింది. 

📰 Generate e-Paper Clip

ఎన్విఆర్ న్యూస్ తెలుగు పొలిటికల్ పవర్ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ స్టేట్స్ ఇంచార్జ్ ఆలస్యం విరన్ ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర నాయకులు ఎజె రమేష్ మాట్లాడుతూ ఈనెల 10న క్విట్ ఇండియా ఉద్యమం స్ఫూర్తితో జైల్ భరో జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మిక చట్టాలని కార్మికులకు అండగా లేకుండా యజమాన్యానికి ఉండే విధంగా 29 కార్మిక చట్టాలని మార్చి కార్మికుల్ని బలి పశువులు గ చేస్తున్న మోడీ ప్రభుత్వా జైల్ భరో జయప్రదం చేయాలని 8 గంటల పని ఎందరో త్యాగాలతో తెచ్చుకున్న పనిని 12 గంటలకి తెచ్చిన మోడీ కార్మికులపై ప్రమాదంగా మారుతున్నాయని అన్నారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు అన్నవరపు కనకయ్య మాట్లాడుతూ 2025లో విత్తనం చట్టానికి సవరణలు ప్రతిపాదించారు రైతుల్ని దివాలా తీసే విధంగా రైతుల పంటకు గిట్టుబాటు రేటు లేకుండా నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతుల్ని బానిసలుగా చేసే విధంగా మోడీ ప్రభుత్వం ఉందని అందుకు దేశవ్యాప్తంగ క్విట్ ఇండియా ఉద్యమం మరొకసారి మోడీ ప్రభుత్వం పై ఉద్యమించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులుగా ఎస్.కె అబీద,వ్యకస జిల్లా సహాయ కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు, సిఐటియు నాయకులు కనకం వెంకటేశ్వర్లు, ఎస్.కె పాషా, బత్తుల గోపాలరావు, ఆదూరి నరసింహారావు, ధర్మ ,కన్నయ్య, మర్రి వెంకటరెడ్డి, సుధాకర్, శివ, పద్మ, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!