*ట్రస్ట్ చైర్మన్ వీరన్ తో కలిసి కన్వీనర్ గా దేవేందర్ – సేవా కార్యక్రమాలు మరింత వేగవంతం*
ఒకటి ఆగస్టు 2026. ఎన్ వి ఆర్ న్యూస్ తెలుగు పొలిటికల్ పవర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ ఇంచార్జ్ ఆలస్యం విరన్. *సేవా కార్యక్రమాలలో ముందుంటున్న *శ్రీ కాశీ విశ్వనాథేశ్వర చారిటబుల్ ట్రస్ట్* కన్వీనర్ గా *దేవేందర్* ని ట్రస్ట్ చైర్మన్ *ఆలస్యం వీరన్* నియమించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ గత సంవత్సరకాలం నుంచి వారంలో నాలుగు రోజులు అన్నదాన కార్యక్రమం చేస్తూ మరొక మూడు రోజులు మూగ జంతువులకు పండ్లు ఫలాలు ఇవ్వడం జరుగుతుంది , ఇప్పటికే కమిటీలో ఉన్నటువంటి వారిని కొంతమందిని తొలగించి కొత్తవారిని నియమించడం జరుగుతుంది. ఈ విషయంలో ఎవరిని కించపరచవలసిన అవసరం లేదని వారి యొక్క అవసరం ట్రస్ట్ కి ఏమాత్రం లేకపోవడం వలన వారిని తొలగించి కొత్తవారిని నియమించడం జరిగింది.
ట్రస్ట్ కన్వీనర్ గా ఎన్నుకున్న రోజు దేవేందర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేయడం చాలా సంతోషకరంగా ఉందని ట్రస్ట్ చైర్మన్ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా దేవేందర్ మాట్లాడుతూ _”ట్రస్ట్ నాపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు. పేద, మధ్యతరగతి ప్రజలకు, చిన్న వ్యాపారులకు, భక్తులకు అండగా నిలిచి మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాం”_ అని అన్నారు.
ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం, వైద్య సహాయం, విద్యార్థులకు సహాయం, ఆలయ అభివృద్ధి కార్యక్రమాలను ముమ్మరం చేస్తామని తెలిపారు.
దేవేందర్ నియామకాన్ని ట్రస్ట్ సభ్యులు, స్థానిక ప్రజలు, వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
*శ్రీ కాశీ విశ్వనాథేశ్వర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఆలస్యం విరన్. మొబైల్ 8465809369*
