ePaper
Sunday, August 2, 2026
📄 ePaper
Homeతెలంగాణఖమ్మంప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం లేదంటూ యువకుడి ఆత్మహత్యాయత్నం

ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం లేదంటూ యువకుడి ఆత్మహత్యాయత్నం

📰 Generate e-Paper Clip

ఇన్ సెట్ లో ఆత్మహత్యకు పాల్పడిన యువకుడి ఫైల్ ఫోటో

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక/ పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి: ధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం గ్రామానికి చెందిన వేణు కుమార్ అనే యువకుడు ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల కావడం లేదనే మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతూ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నానని, ఎన్నికల సమయంలో సంవత్సరానికి రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీ ఇవ్వడంతో విశ్వసించి కాంగ్రెస్ పార్టీని గెలిపించామని, అయితే రెండున్నరేళ్లు గడిచినా ఆ హామీలు అమలు కాలేదని ఆయన తన ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. అలాగే తాను రాసిన సూసైడ్ నోట్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ వరకు చేరవేయాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. యువకుడి ఆరోగ్య పరిస్థితిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!