ePaper
Monday, August 3, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్కడపఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మహాలక్ష్మి పథకం ఎప్పుడు అమలు చేస్తారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మహాలక్ష్మి పథకం ఎప్పుడు అమలు చేస్తారు.

📰 Generate e-Paper Clip

పలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వైయస్సార్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్ మహిళలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాం. డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షుల ముడియం చిన్ని. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని ఊరు వాడ తిరుగుతూ మహిళలకు అనేక హామీలు ఇచ్చారని తీరా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఇస్తామన్నా మహాలక్ష్మి పథకం ఇంతవరకు ఇచ్చినటువంటి పాపాన పోలేదన్నారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి సూపర్ సిక్స్ భాగమైనటువంటి మహాలక్ష్మి పథకం ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం డివైఎఫ్ఐ మహిళా కన్వినింగ్ కమిటీ సమావేశం సుందరయ్య కాలనీలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి పట్టణ అధ్యక్షుడు ఎస్కే మస్తాన్ షరీఫ్ అధ్యక్షత వహించడం జరిగింది . ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వం మహిళలకు 18 సంవత్సరాల నిండిన ప్రతి మహిళకు మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతినెల 1500 రూపాయలు నగదు చెల్లిస్తానని లోకేష్ బాబు పాదయాత్ర సందర్భంగా కనిపించినటువంటి ప్రతి మహిళకు హామీ ఇవ్వడం జరిగింది . అయితే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని కూటమి ప్రభుత్వం హంగుహార్భాటాలు చేసుకోవడం తప్ప చేసింది ఏమీ లేదని వారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పైబడి అవుతున్న ఒక్క మహిళ ఖాతాలో ఒక్క రూపాయి వేసిన పాపాన పోలేదన్నారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆలోచించి ఎన్నికల ముందు మహిళలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని అమలు చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మహిళలను కలుపుకొని పెద్ద ఎత్తున సూపర్ సిక్స్ పథకాలు అమలయింతవరకు పోరాటాలు కొనసాగిస్తామని వారు హెచ్చరించారు ఈ సమావేశంలో డివైఎఫ్ఐ బద్వేల్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఎస్కే మస్తాన్ షరీఫ్ ఎస్ కే ఆదిల్ మహిళలు షేక్ ఫాతిమా నాగేశ్వరి అరుణ మాధవి లత పీరమ్మ నాగరత్నమ్మ కృష్ణవేణి గౌసియా రిజ్వానా ఆయేషా వెంకటమ్మ పద్మ లక్ష్మీదేవి ఖాదర్ బి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!