ePaper
Friday, July 31, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్కడపనేటి విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి..

నేటి విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి..

📰 Generate e-Paper Clip

“ఓం శాంతి బ్రహ్మకుమారి సమాజం”

పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ జాతీయ సమగ్ర దినపత్రిక రిపోర్టర్ ఎన్ ప్రసాద్ రావు కలసపాడు కడప జిల్లా  బద్వేల్ నియోజకవర్గం లోని కలసపాడు మండలంలో నేటి యువత మత్తు పదార్థాలకు చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా ఉండాలని, మండల ఓం శాంతి నిర్వాహకురాలు, బ్రహ్మకుమారి తెలిపారు. శుక్రవారం విద్యార్థిని ,విద్యార్థులు, వ్యసనాలకు దూరంగా ఉండాలని సంకల్పంతో స్థానిక సెయింట్ ఆంటోనీ ఇంగ్లీష్ మీడియం పాఠశాల యందు విద్యార్థినీ ,విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ప్రస్తుత సమాజంలో విద్యార్థులు చేసే ప్రతి పని, అందరికీ ఉపయోగపడేదిగా ఉండాలన్నారు. ప్రతి విద్యార్థి ఏ పనినైనా సాధిస్తాం, అనే సంకల్పముతోఉండాలని తెలిపారు. ఏదైనా ఒక పనిని సాధించాలంటే ఓర్పు ,సహనం ,పట్టుదల, క్రమశిక్షణ ఎంతో అవసరం అన్నారు. ఇవన్నీ ఒక్క యోగా ద్వారానే సాధ్యమవుతాయని అన్నారు. ఈ వ్యసనాలు అన్నింటిని అరికట్టే విధంగా ప్రతి విద్యార్థి నడుం బిగించాలని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్. చిత్తా రాజశేఖర్ రెడ్డికి ఓం శాంతి తరఫున సర్టిఫికెట్స్ అందించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!