ePaper
Saturday, August 1, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్కడపఉదయాన్నే ఇంటింటికి వెళ్లి వృద్ధాప్య పింఛన్లు పంపిణీ చేస్తున్న పంచాయతీ సెక్రెటరీ శివయ్య

ఉదయాన్నే ఇంటింటికి వెళ్లి వృద్ధాప్య పింఛన్లు పంపిణీ చేస్తున్న పంచాయతీ సెక్రెటరీ శివయ్య

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు, కడప జిల్లా బ్యూరో వెంకటేశ్వర్లు: బ్రహ్మంగారిమఠం మండలంలో పంచాయతీ సెక్రెటరీ పూజ శివయ్య తన విధి నిర్వహణలో భాగంగా వృద్ధాప్య పింఛన్లను లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేస్తున్నారు. శనివారం ఉదయం 6 గంటలకే పోలేరమ్మ నగర్‌లోని వృద్ధుల ఇళ్లకు వెళ్లి తలుపులు తట్టి పింఛన్ తీసుకోవాలని తెలియజేస్తూ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. వృద్ధులు ఇబ్బందులు పడకుండా వారికి సకాలంలో పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటున్న పంచాయతీ సెక్రెటరీ శివయ్య సేవలను స్థానికులు అభినందించారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి చేరేలా అధికారులు, సిబ్బంది కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!