– ప్రత్యేక తెలంగాణ సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ చేసిన సేవలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి కొనియాడారు,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు07.2026.
ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు.తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన జయంతి వేడుకలకు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖిమ్యా నాయక్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్ తో కలిసి కలెక్టర్ ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్,మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ చేసినసేవలుచిరస్మరణీయమని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఆయన జీవితాంతం చేసిన కృషి భావితరాలకు ఆదర్శంగానిలుస్తుందని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూస్ఫూర్తిగాతీసుకొనిసమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు,మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్,
మహనీయుల ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గంధం నాగరాజు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


