ePaper
Thursday, August 6, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిఅక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులు అరెస్ట్

అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులు అరెస్ట్

📰 Generate e-Paper Clip

– గంజాయి విక్రయం, రవాణా లేదా వినియోగం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై  చట్టపరంగా కఠినచర్యలుతీసుకుంటo,
– కొత్తకోట ఎస్సై. ఎం. విక్రమ్,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్.ఆగస్టు 07.2026.
అక్రమంగా ఎవ్వరైనా గంజాయి విక్రయం, రవాణావినియోగంవంటిచట్టవిరుద్ధకార్యకలాపాలకుపాల్పడేవారిపైచట్టపరంగాకఠినచర్యలుతీసుకుంటoమని కొత్తకోట ఎస్సై. ఎం. విక్రమ్ అన్నారు. గురువారం కొత్తకోట పోలీస్ స్టేషన్ పరిధిలోని కానాయపల్లి గ్రామ శివారులో భీమా ఫేజ్-II కాలువసమీపంలోవిశ్వసనీయ సమాచారంపై ఎస్సై. ఎం. విక్రం, కొత్తకోట పోలీస్ స్టేషన్, పోలీసు సిబ్బందితో కలిసి దాడి నిర్వహించారు. ఈదాడిలో గంజాయి విక్రయిస్తున్న బంగారు భరత్ కుమార్, వయస్సు: 39 సం,  వనపర్తి పట్టణం, గంజాయి కొనుగోలు చేస్తున్న 1) జనుంపల్లి పవన్, వయస్సు 25 సం, గ్రామం కానాయపల్లి  2) ఇనుపునూరి గణేష్, వయస్సు 25 సం.గ్రామం కానాయపల్లి ముగ్గురువ్యక్తులనుఅదుపులోకితీసుకున్నామని, వారి వద్ద నుండి 7 గ్రాముల గంజాయి (విలువ సుమారురూ.1,500),2ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లు, 2. ద్విచక్ర వాహనాలను స్వాధీనంచేసుకుని, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు
పంపినామని తెలిపారు.గంజాయి విక్రయం, రవాణా లేదా వినియోగం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఇకపై కూడాచట్టపరంగాకఠినచర్యలుతీసుకుంటామని హెచ్చరిస్తున్నామని, ప్రజలు తమ పరిసరాల్లో గంజాయి విక్రయం ఇతర అనుమానాస్పదకార్యకలాపాలుగమనించిన వెంటనే కొత్తకోట పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ ఫోన్ నంబర్ 8712670621 లేదా డయల్-112 కు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.ఈ సమావేశంలో కొత్తకోట సీఐ. రాంబాబు, ఏఎస్ఐ సాగర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!