– సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు, ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి, సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్.9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 07.2026.
కష్టజీవుల ద్రోహి బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం అని గద్దె దించేందుకు ఐక్యంగా పోరాడాలనిసిపిఐజిల్లాకార్యవర్గసభ్యుడు,ఏఐటీయూసీజిల్లాసహాయ కార్యదర్శి, సిపిఐ వనపర్తినియోజకవర్గకార్యదర్శిరమేష్,ప్రజానాట్యమండలి జిల్లా ప్రధానకార్యదర్శి వంక గోపాల్ పిలుపునిచ్చారు.గురువారం సిపిఐ కేంద్రకమిటీపిలుపుమేరకుబిజెపినరేంద్రమోడీప్రజావ్యతిరేకవిధానాలు,ప్రజాసమస్యలపరిష్కారం కోసం పానగల్ మండలం తెల్లరాల్లపల్లి, కేతేపల్లి, వెంగలాయిపల్లి, బండపల్లి, బహదూర్ గూడెం చౌరస్తాల మీదుగా పాన్గల్ కు సుమారు పది కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. పాదయాత్రను సీపిఐ జిల్లా కార్యవర్గ సభ్యురాలు, ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యూ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు, కేతేపల్లి మాజీ సర్పంచ్ కళావతమ్మ ఎర్రజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా నేతలు తెల్లరాళ్లపల్లి,కేతేపల్లి,పానగల్,బస్టాండ్,లోమాట్లాడుతూ నరేంద్ర మోడీ రైతులు, కూలీలు, కార్మికులు, నిరుద్యోగులు, మహిళలు, ఉద్యోగులు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని యువతను, ప్రతి రైతు ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తామని రైతులను, ధరలు తగ్గిస్తామని సామాన్యులను, ఉపాధి కల్పిస్తామని కూలీలను మోసంచేశారన్నారు. 29కార్మికచట్టాలనునాలుగులేబర్,కోడలుగాచేసికార్మికులహక్కులనుకాలరాచారన్నారు.అమెరికాతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చేసుకోవడంతో వారితో పోటీపడి మార్కెట్లో ఉత్పత్తులను అమ్మ లేక ఆత్మహత్య చేసుకునేపరిస్థితిఏర్పడిందన్నారు. సామాన్యుల కష్టాన్ని దోచి సంపన్నులకు పెట్టే పాలన సాగిస్తున్నారని చరమగీతం ఫలితాలుఅన్నారు.సంపన్నులుదోపిడీకివ్యతిరేకంగారైతులుకార్మికులుఅన్నివర్గాలకుఅండగాపోరాడుతుందనికార్మికరాజ్యంవచ్చేదాకాపోరాటంకొనసాగిస్తుందన్నారు.మతం,అయోధ్యపేరుతోప్రజలనుమభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని, రామ మందిరం నిధులు దోచుకున్న నరేంద్ర మోడీ మాట్లాడటం లేదన్నారు. మతంపై దేవునిపై బిజెపికి నమ్మకం లేదని అధికార ఒక్కటే వారి పరమావదని విమర్శించారు. దేశంలో సి జె పి పేరుతో యువత తిరగబడితే నరేంద్ర మోడీ తోకముడిచారని, శ్రమజీవులు తిరగబడితే బీజేపీ అధికారం మోసపు పాలన, సంపన్నులకు అనుకూల పాలన అంతమవుతుందన్నారు. పాదయాత్రల ప్రధాన డిమాండ్ అధిక ధరలు తగ్గింపు, యువతకు ఉద్యోగాలు, పంటల మద్దతు ధరకు చట్టబద్ధత, దళితులు ఆదివాసులపై దాడులు ఆపటం, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయటం, బ్యాలెట్ పద్ధతిన ఎన్నికలు ప్రధాన డిమాండ్ తో పాదయాత్ర ఈనెల 6 నుంచి 14 వరకు జరుగుతుందని అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కళావతమ్మ, సిపిఐ వనపర్తి నియోజకవర్గం కార్యదర్శి రమేష్, ప్రజానాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్, పానగల్ మండల కార్యదర్శి డంగు కుర్మయ్య, కేతేపల్లి ఉప సర్పంచ్ కృష్ణవేణి, ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి సంతోష్, సిపిఐ మాజీ మండల కార్యదర్శిశివకుమార్, తెల్లరాళ్లపల్లిమాజీఉపసర్పంచ్,బాలస్వామి, చెన్నమ్మవార్డు సభ్యులు కురుమమ్మ, డంగు లక్ష్మి, మాజీ వార్డు సభ్యుడు పెంటయ్య, తెల్లర్లపల్లి, కేతేపల్లి,బొల్లారం,వెంగళాయిపల్లి సిపిఐ గ్రామ కార్యదర్శిసహదేవుడు,కాకం చిన్న నారాయణ, మల్లెపు బాలస్వామి, చల్మారెడ్డి,చిన్నఎల్లయ్య,బయ్యకురుమయ్య, రామాంజనేయులు, మల్లేష్, భరత్, ఎస్. రాముడు,పరశురాముడు,మేస్త్రిరాముడు,తెలుగులక్ష్మి,దేవమ్మ,వెంకటయ్య,తదితరులు పాల్గొన్నారు.


