ePaper
Thursday, August 6, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తితెలంగాణ ఉద్యమ వెలుగులు ప్రో.జయశంకర్, గద్దర్ పాలుస శంకర్ గౌడ్ జిల్లా అధ్యక్షులు సాహితీ కళా...

తెలంగాణ ఉద్యమ వెలుగులు ప్రో.జయశంకర్, గద్దర్ పాలుస శంకర్ గౌడ్ జిల్లా అధ్యక్షులు సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 06 2026: తెలంగాణ ఉద్యమానికి వెలుగులు నింపిన మహనీయులు ప్రో.కొత్తపల్లి జయశంకర్, ప్రజాయుద్ధనౌక గద్దర్ అని సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ అన్నారు. గురువారం ప్రో. జయశంకర్ జయంతి,గద్దర్ వర్ధంతి కార్యక్రమాన్ని సాహితీ కళా వేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని రేడియంట్ హై స్కూల్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో శంకర్ గౌడ్ మాట్లాడుతూ… తొలినాటి నుండి తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని తన ఉపన్యాసాలు, రచనల ద్వారా బలంగా వినిపించిన గొప్ప మానవతావాది ప్రో. జయశంకర్ అని అన్నారు.అలాగే అట్టడుగు వర్గ ప్రజల బాధలను, వేదనలను,సమస్యలను తన పాట ద్వారా వినిపించి సమాజాన్ని చైతన్యపరిచిన మహా గాయకుడు గద్దర్ అని వివరించారు. ఒకరు మాటకు ప్రతినిధిగా, మరొకరు పాటకు ప్రతినిధిగా నిలిచి ప్రజల గుండెలలో చిర స్థాయిగా స్థానం సంపాదించుకున్న మహోన్నత వ్యక్తులు వారు అని పేర్కొన్నారు. ఆ మహనీయుల ఆశయ సాధన కోసం ప్రజలు, ప్రజాప్రతినిధులు తప్పక కృషి చేయాల్సిన అవసరం ఉందని శంకర్ గౌడ్ పేర్కొన్నారు. ప్రో. జయశంకర్, గద్దర్ చిత్ర పటాలకు ఉపాధ్యాయులు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కళావేదిక ప్రతినిధులు కందూరు నారాయణ రెడ్డి, జనజ్వాల, బైరోజు చంద్ర శేఖర్, సత్తార్, నిరంజనయ్య, బండారు శ్రీనివాస్, దేశి రాములు యాదవ్, గంధం నాగరాజు, పెరుమాళ్ళ శ్రీనివాస్, వెంకటయ్య, బొజ్జిబాబు, మద్దిలేటి, కర్నె శివ, డి.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!