పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ అనకాపల్లి జిల్లా బ్యూరో కథనం సమాజంలో నేర నియంత్రణకు పకడ్బందీ దర్యాప్తులు, ఎవిడెన్స్ ఆధారిత ప్రక్రియలు పోలీసుల స్వభావాన్ని సంకల్పించి నిందితులకు శిక్షలు పడేలా చేయాలని ఏపీ ప్రభుత్వం పదే పదే చెబుతోంది. రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ పోలీసు ప్రతిష్ఠాత్మకంగా పోలీసు లిటిగేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. పోలీసు ఉన్నతాధికారులైన డీజీపీ ఇతర అధికారుల క్రిమినల్ అంశాలపై ఉన్న కేసులను పరిశీలించాలని జిల్లా ఎస్పీలకు పలు మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ, నిష్పక్షపాతంగా, సాక్ష్యాల ఆధారంగా కేసుల దర్యాప్తు చేయడంలో కోర్టులో కేసులు నిలవడం కష్టంగా మారుతోంది. దీనివల్ల న్యాయమూర్తులు పలుమార్లు పోలీసు శాఖపై అసహనం వ్యక్తం చేస్తున్నప్పటికీ, కేసులకు సంబంధించిన పోలీసుల దర్యాప్తు లోపం ఇప్పటికీ చెక్కుచెదరకుండా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో పలు కేసుల దర్యాప్తు విషయంలో స్పష్టత లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్థానిక జిల్లా ఎస్పీ క్షేత్ర స్థాయిలో పలుమార్లు సమీక్ష చేసినప్పటికీ, కేసులలో సాక్ష్యాలను చట్టబద్ధంగా సేకరించడంలో, నిష్పాక్షికంగా వ్యవహరించడంలో లోపాలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో నమోదైన కొన్ని క్రిమినల్ కేసులను ప్రస్తుతం దర్యాప్తు అధికారులు ఉపసంహరించేందుకు లేదా భిన్నమైన నిర్ణయాలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో బాధితులు మరింత ఫిర్యాదులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫిర్యాదుదారులు వాదన ప్రకారం, పరవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల్లో సంబంధిత ఇన్స్పెక్టర్ నమోదు చేసిన కేసులపై ప్రస్తుతం స్టేషన్ అధికారులు భిన్నమైన వైఖరి అవలంబిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదుదారులు నిష్పాక్షికంగా దర్యాప్తు చేయాలని కోరుతున్నప్పటికీ, కొన్ని దర్యాప్తు అంశాల్లో న్యాయం జరగడం లేదని భావన వ్యక్తమవుతోంది. ప్రజలు మరియు ఫిర్యాదుదారులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం ప్రకారం, సాధారణ పోలీసు విధి విధానాన్ని పక్కనబెట్టి, చట్టబద్ధమైన దర్యాప్తు ప్రమాణాలను పాటించడం అత్యంత అవసరమని పేర్కొంటున్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలంటే, పోలీసు అధికారులు సాక్ష్యాల ఆధారంగా, నిష్పాక్షికంగా వ్యవహరించాలని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. ప్రజలలో పోలీసులపై నమ్మకం పెంచేలా విధులు నిర్వహించాలని ప్రభుత్వం పలుమార్లు సూచిస్తున్నప్పటికీ, ఇటీవల రాష్ట్ర కార్యాలయానికి, జిల్లా ఎస్పీ కార్యాలయానికి, సంబంధిత ఫిర్యాదులపై దర్యాప్తులు ఎలా జరుగుతున్నాయనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. దర్యాప్తు విధానం మరియు ఫిర్యాదులను నిష్పాక్షికంగా పరిశీలించి, దర్యాప్తులో ఎటువంటి చట్టవిరుద్ధ చర్యలు, విధి నిర్లక్ష్యాలు లేకుండా అధికారులు వ్యవహరించేలా పర్యవేక్షణ మరింత బలోపేతం చేయాలని, పోలీసు ప్రతిష్ఠ పెరిగేలా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు సమాజిక న్యాయం కోరుతున్నారు.
గాడి తప్పిన దర్యాప్తులు, నీరు గారిపోతున్న కేసులు, జైళ్లలో నిర్దోషులు
RELATED ARTICLES
