నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సహచరి అవగాహన కార్యక్రమం
మల్కాజ్గిరి
పొలిటికల్ పవర్ న్యూస్ తెలుగు దినపత్రిక తెలంగాణ స్టేట్ క్రైమ్ బ్యూరో మహేందర్ యాదవ్ (07.08.2026) మల్కాజిగిరి నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయకనగర్ అంబేడ్కర్ భవనంలో “సహచరి” ప్రోగ్రామ్ను విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఈఓడబ్ల్యూ (EOW) ఏసీపీ సత్తయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న ప్రజలకు మరియు సహచరి సభ్యులకు పలు కీలక అంశాలపై అవగాహన కల్పించారు: మీ సురక్ష ప్రోగ్రామ్: మహిళలు మరియు ప్రజల భద్రత కోసం ప్రవేశపెట్టిన మీ సురక్ష ప్రాముఖ్యతను వివరించారు. సైబర్ నేరాలు: మారుతున్న సాంకేతికతతో జరుగుతున్న సైబర్ మోసాలు, వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్పష్టమైన అవగాహన కల్పించారు. ఈఆర్ఎస్ఎస్ డయల్ 112 (ERSS Dial 112): అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం కోసం డయల్ 112 సేవలను ఎలా ఉపయోగించుకోవాలో వివరించారు. పోలీస్ వ్యవస్థ & సహచరి పాత్ర: పోలీస్ స్టేషన్ పనితీరు, పోలీసుల విధులు మరియు సమాజంలో “సహచరి” సభ్యులు నిర్వహించాల్సిన కీలక పాత్ర గురించి తెలిపారు. ఈ అవగాహన సదస్సులో మొత్తం 68 మంది సహచరి సభ్యులతో పాటు ఏసీపీ ఈఓడబ్ల్యూ సత్తయ్య, నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

