ePaper
Friday, August 7, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

బోనాల పండుగ వేళ గుడ్‌న్యూస్: వరుసగా మూడ్రోజులు సెలవులు..

ఆగస్టు 7 : పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

తెలంగాణలోని పాఠశాలలు, కళాశాలలకు ఈ వారాంతంలో (వీకెండ్) వరుసగా మూడు రోజుల పాటు వరుస సెలవులు రానున్నాయి. ఈ నెల (ఆగస్టు)లో పండుగలు, సాధారణ సెలవుల కారణంగా విద్యాసంస్థలు సుదీర్ఘ హాలీడేస్ రాబోతున్నాయి._

 

_ఆగస్టు 08న రెండో శనివారం సెలవు, ఆగస్టు 09న ఆదివారం, ఆగస్టు 10న సోమవారం బోనాల పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు అధికారిక సెలవు ప్రకటించింది. శని, ఆది, సోమవారాలు ఒకేసారి కలిసి రావడంతో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు “లాంగ్ వీకెండ్” లభించనుంది. ఈ ఆగస్ట్ నెలలో ఆదివారాలు, రెండో శనివారం, స్వాతంత్య్ర దినోత్సవం, బోనాలు తదితర పండుగలు, వరుస వేడుకల కారణాల వల్ల విద్యాసంస్థలకు మొత్తం 11 రోజుల పాటు సెలవులు లభించనున్నాయి. వరుస సెలవుల నేపథ్యంలో పలు కుటుంబాలు బోనాల ఉత్సవాల్లో పాల్గొనడానికి, స్వగ్రామాలకు ప్రయాణమయ్యేందుకు సిద్ధమవుతున్నాయి._

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!