ePaper
Monday, August 10, 2026
📄 ePaper
Homeతెలంగాణరఘునాధపాలెం మండలంలో మట్టి గుట్టలను పిండేస్తున్న దోపిడీ దొంగలు ఎవరు....!

రఘునాధపాలెం మండలంలో మట్టి గుట్టలను పిండేస్తున్న దోపిడీ దొంగలు ఎవరు….!

📰 Generate e-Paper Clip


————————-
వారి వెనక ఉన్నది అధికారులా(లేదా)అధికార పార్టీ నేతలా..?
– పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్ ———————–
నాటి ప్రభుత్వంలో మట్టి మాఫియా జరిగింది అని, పదే పదే విమర్శించారు.
———————–
మరి నేడు జరుగుతున్న మట్టి మాఫియా వెనుక దాగి ఉన్న నేతలు ఎవరు..?
———————
మెడికల్ కళాశాల అంతా కూడా నాసిరకం పనులు..!
————————
మెడికల్ కళాశాలకు కేటాయించిన స్థలంలో ఉన్నటువంటి విలువైన *ఖనిజనిక్షేపాలు* (డోలమైట్) అమ్ముకున్నారు.
————————
నాటి ప్రభుత్వంలో మట్టి మాఫియా జరిగిందని పదేపదే తీవ్ర విమర్శలు చేసిన ప్రస్తుత మంత్రి ప్రస్తుతం ప్రజాపాలనలో జరుగుతున్నది ఏమిటి. గత రెండు సంవత్సరాలుగా రఘునాధపాలెం మండలంలో పెద్ద ఎత్తున మట్టి మాఫియా జరుగుతుంది.
ఈ *మట్టి మాఫియా డాన్* ను ప్రోత్సహిస్తున్నది ఎవరు. ఆ డాన్ కు అధికార పార్టీ నాయకులకు మరియు మైనింగ్ అధికారులకు ఉన్న సంబంధాన్ని
వివరించాలి.
——————-
*షేక్ బాజీ బాబా*
జిల్లా అధ్యక్షుడు
ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ IUML పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు.
————————

ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ IUML పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రఘునాథపాలెంలో జరుగుతున్న మట్టి మాఫియా పై అదేవిధంగా మెడికల్ కళాశాలలో జరుగుతున్న నాసిరకం పనులపై జిల్లా కమిటీ బృందం పర్యటించి పరిశీలించగా, మెడికల్ కళాశాల పూర్తి కావస్తూ ఉంది.
ఇంకా భూమి చదును పేరుతో కోట్ల రూపాయల మట్టిని అమ్ముకుంటున్నారు.

అదేవిధంగా ఇదే మెడికల్ కళాశాలలో కేటాయించిన భూమిలో విలువైన ఖనిజనిక్షేపాలు *(డోలమైట్)* అమ్ముకున్నారు.

ఇదే విషయంపై జిల్లా మైనింగ్ అధికారులకు పదే పదే వివరించిన కూడా మాకు అధికార పార్టీ నుండి ఒత్తిళ్లు ఉన్నాయని చెప్పేసి మైనింగ్ అధికారులు తెలియజేయడం జరుగుతుంది.

గత ప్రభుత్వంలో ప్రజల అవసరాల దృష్ట్యా ఒక లారీ మట్టి కేవలం 2000/- రూపాయలు ఉంటే నేటి ప్రభుత్వంలో 6000/- వేలకు చేరుకుందని, ఆయన అన్నారు.

కాబట్టి పై విషయాలను దృష్టిలో ఉంచుకొని…
ఈ ప్రభుత్వంలో
మట్టికి రేటు పెరిగిందా..?

అధికారులకు చెల్లించే లంచం లో రేటు పెరిగిందా..?

అధికార పార్టీ నాయకులకు చెల్లించే లంచం లో రేటు పెరిగిందా….?

ఈ మట్టి మాఫియా పై అధికారులు స్పందించకుంటే, సామాన్య ప్రజల మద్దతు కూడగట్టుకుని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ IUML పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ బాజీ బాబా హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!