పెద్ది కుటుంబానికి, పార్టీ తరఫున రూ. 2 కోట్ల 25 లక్షల ఆర్థిక సాయం
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజా శేఖర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరో కోటి రూపాయలు, వృద్ధాప్యంలో ఉన్న వారి తల్లి అమృతమ్మ బాగోగుల కోసం మరో రూ. 25 లక్షలు ఇచ్చి అండగా నిలవాలని అధినేత కేసీఆర్ నిర్ణయం
అంతటితో కాకుండా పిల్లల భవిష్యత్తు, వారి చదువు తదితర కుటుంబ సంక్షేమానికి సంబంధించి పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తూ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చిన కేసీఆర్
పార్టీ సీనియర్లు, వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో చర్చించి నిర్ణయం తీసుకున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి దశదినకర్మల కార్యక్రమాలు ముగిసిన తర్వాత జిల్లా పార్టీ ముఖ్యులు కూర్చొని వారి కుటుంబానికి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారని, ఎల్లకాలం వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని కేసీఆర్ భరోసా

