ePaper
Monday, August 10, 2026
📄 ePaper
Homeతెలంగాణనారాయణరావు పేట హాస్టల్‌ను సందర్శించి, విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం *

నారాయణరావు పేట హాస్టల్‌ను సందర్శించి, విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం *

📰 Generate e-Paper Clip

 

10-08-2026 | దుమ్ముగూడెం మండలం

ఎన్విఆర్ న్యూస్ తెలుగు పొలిటికల్ పవర్ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ స్టేట్స్ ఇంచార్జ్ ఆలస్యం విరన్. దుమ్ముగూడెం మండలం , నారాయణరావుపేటలోని హాస్టల్‌ను భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేసి, వారి సమస్యలు, సౌకర్యాలపై ఆరా తీశారు.

హాస్టల్‌లోని కిచెన్, తరగతి గదులు, వసతి గదులను ఎమ్మెల్యే పరిశీలించారు. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని, చక్కగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.

విద్యార్థులకు ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే, సంబంధిత అధికారులతో పాటు ప్రభుత్వంతో మాట్లాడి తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!