ePaper
Monday, August 10, 2026
📄 ePaper
Homeతెలంగాణమండల కేంద్రం లో ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవ సాంస్కృతిక ర్యాలీ*

మండల కేంద్రం లో ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవ సాంస్కృతిక ర్యాలీ*

📰 Generate e-Paper Clip

*అంగరంగ వైభవంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం*

*అశ్వారావుపేట పొలిటికల్ పవర్ న్యూస్ ఆర్సి వెంకటేష్ ఆగస్టు 9*ములకలపల్లి మండల కేంద్రంలో ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివాసి కొమ్ము నృత్యాలు,సాంప్రదాయ నృత్యాలతో బారి సాంస్కృతిక ర్యాలీ నిర్వహించారు.అనంతరం ఆదివాసి సేన కార్యాలయ సభ స్థలం ప్రాంగణం లో *ఆదివాసి సంఘాల JAC జెండా ను ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు*.మండల వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచ్ లు,పెద్దలు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది.ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా హాజరు అయిన తెలంగాణ ఆదివాసి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,న్యాయవాది ఊకె రవి,ఆదివాసి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ అధికార ప్రతినిధి సోయం కన్న రాజు పాల్గొని ప్రసంగించారు.అనంతరం వారు మాట్లాడుతూ అన్ని ఆదివాసి సంఘాలు కలవడం శుభపరిమణమని అలాగే ఆదివాసి హక్కులు చట్టాలు అమలు కోసం ప్రతి ఒక్కరు పోరాటం చేయవలసిన అవసరం ఉన్నదని,అలాగే చట్టాల అమలు కోసం కోట్లాడవలసిన అవసరం ఉందని తెలియజేసారు.రోజు రోజుకు హక్కులు కోల్పోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మండలంలో ఉన్న అన్ని సర్పంచ్ లు చంద్రలేఖ,వాడే రాములు, సోడే చైతన్య, కోర్స ఆదిలక్ష్మి,మాజీ సర్పంచ్ లు,మాజీ ప్రజాప్రతినిధులు,ఎరుకల హక్కుల పోరాట సమితి ప్రధాన కార్యదర్శి గరికే ఉపేందరు,JAC నాయకులు కొండ్రు సుందర్ రావు,మడకం చిరుమప్ప,కారం సుధీర్,వాడే నరసింహారావు, పాయం నరసింహారావు,కుంజ రాంబాబు, సోడే శ్రీను,దుబ్బ భాస్కర్,కీసరి నాగేష్,పడ్డం నరేష్ తదితరులు,యువత,మహిళలు,ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!