బద్వేల్ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి యన్ 9టీవీ తెలుగు న్యూస్ కడప జిల్లా బ్యూరోఎం వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు చదువుకున్న ప్రతి విద్యార్థికి తల్లికి వందనం డబ్బులు తల్లుల అకౌంట్లో వేస్తామని చెప్పడం జరిగింది అయితే ఈ పథకం కొంతమందికి మాత్రమే అకౌంట్ లో డబ్బులు పడడం జరిగిందని అర్హులైన ప్రతి విద్యార్థికి తల్లికి వందనం తల్లులు ఖాతాలో జమ చేయాలని డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని తెలిపారు
సోమవారం డివైఎఫ్ఐ బద్వేల్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బద్వేల్ శాసన సభ్యురాలు అయిన డాక్టర్ సుధా మేడం కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది
ఈ సందర్భంగా డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని మాట్లాడుతూ…. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఊరు వాడ తిరుగుతూ మేము అధికారంలోకి వస్తే మీ ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారు వారందరికీ వారి తల్లులు ఖాతాల్లో 15000 రూపాయలు ఇస్తామని ఎన్నికల ముందు చెప్పడం జరిగింది తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి విద్యార్థికి 13 వేల రూపాయలు ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు 5000 రూపాయలు తల్లులు ఖాతాలో వేసి చేతులు దులుపుకుంటున్నారని వారు తెలిపారు ఇంకా అర్హత ఉన్నా విద్యార్థులకు వారి తల్లిదండ్రులు ఖాతాలో ఒక్క రూపాయి కూడా ఇంతవరకు రాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం మేము సూపర్ సిక్స్ పథకాలు ప్రతి ఒక్కటి అమలు చేస్తామని చెప్పి తీరా సూపర్ సిక్స్ లో భాగమైన తల్లికి వందనం పథకంలో కూడా కోతలు పెట్టడం దుర్మార్గమన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు ఖాతాలో తల్లికి వందనం డబ్బులు వేయాలని వారు తెలిపారు లేకపోతే విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు కొనసాగిస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఎస్కే మస్తాన్ షరీఫ్ ఎస్ కే ఆదిల్ పట్టణ ఉపాధ్యక్షులు యువరాజ్ తదితరులు పాల్గొన్నారు
అర్హులైన ప్రతి విద్యార్థికి తల్లికి వందనం వెయ్యాలి.ఎమ్మెల్యే కి వినతి పత్రం ఇచ్చిన డివైఎఫ్ఐ నాయకులు.
RELATED ARTICLES

