ePaper
Tuesday, August 11, 2026
📄 ePaper
Homeతెలంగాణతెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారుల గుర్తింపును వేగవంతం చేయండి*

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారుల గుర్తింపును వేగవంతం చేయండి*

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పీ యన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాల బ్యూరో బత్తుల గోపాలరావు
*సుమారుగా లక్ష మంది ఉద్యమకారులకు న్యాయం చేయండి మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తాం*

*డాక్టర్ పిడమర్తి రవి , డాక్టర్ కె.వి కృష్ణారావు*

ఖమ్మం : రెండు తరాల తెలంగాణ ఉద్యమాకారులను సుమారుగా లక్ష మందిని గుర్తించండి కాంగ్రెస్ మళ్ళీ గెలుస్తుందని , అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారుల గుర్తింపును వేగవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారులు డాక్టర్ పిడమర్తి రవి , డాక్టర్ కె.వి కృష్ణారావు అన్నారు . చిన్నారి హాస్పిటల్ డైరెక్టర్ ఆఫీస్ లో రెండు తరాల తెలంగాణ ఉద్యమకారుల అపూర్వ సమ్మేళనం కరపత్రాన్ని జమకారుల సంఘం వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి , తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ కె.వి కృష్ణారావు మరియు మిగతా నాయకులతో కలిసి ఆవిష్కరించారు . తెలంగాణ రాష్ట్రంలో అమరవీరుల కుటుంబాలు ఉద్యమంలో గాయపడిన వారు ఆగిపోయింది జైలుకుపోయిన వారు ఉద్యమం నడిపిన వారు సంఘాలు ఏర్పాటు చేసిన వాళ్లు అందరిని కలిపి లక్ష మందిని గుర్తించాలని వారికి 250 చదరపు గజాల స్థలం మరియు పెన్షన్ , గుర్తింపు కార్డులు ఇవ్వాలని పిడమర్తి రవి కోరారు . సెప్టెంబర్ 16న హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగే అపూర్వ సమ్మేళనానికి 1969 – 2009 ఉద్యమకారులు హాజరుకావాలని కోరారు . ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు దేవి రెడ్డి విజయ్ , మట్టి గురుమూర్తి , జిల్లా విజయ్ , రాకేష్ , భూక్య హరినాయక్ తదితరులు పాల్గొన్నారు .

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!