ePaper
Tuesday, August 11, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తికాళికమ్మ–పోచమ్మ ఆలయ చెరువు కట్ట వెడల్పు పనులకు శ్రీకారం

కాళికమ్మ–పోచమ్మ ఆలయ చెరువు కట్ట వెడల్పు పనులకు శ్రీకారం

📰 Generate e-Paper Clip

ఎమ్మెల్యే జీఎంఆర్ హామీ మేరకు కనిమెట్టలో శరవేగంగా పనులు

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 11 2026: కొత్తకోట దేవరకద్ర శాసనసభ్యులు శ్రీ జి. మధుసూదన్ రెడ్డి (జీఎంఆర్) ఆదేశాల మేరకు కొత్తకోట మండలం కనిమెట్ట గ్రామంలోని శ్రీ కాళికాదేవి ఆలయం సమీపంలో ఉన్న ఊర చెరువు కట్ట వెడల్పు పనులను గ్రామ సర్పంచ్ ముంత రామచంద్ర యాదవ్ ప్రారంభించారు. గత ఏడాది శ్రీ కాళికాదేవి పండుగ సందర్భంగా అమ్మవారి దర్శనానికి ఎమ్మెల్యే జీఎంఆర్ వచ్చిన సమయంలో గ్రామస్తులు చెరువు కట్టను వెడల్పు చేయాలని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే జాతరలోపు చెరువు కట్ట వెడల్పు పనులు చేపడతామని హామీ ఇచ్చారు. ఆ హామీలో భాగంగా ప్రస్తుతం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా గ్రామస్తులు, శ్రీ కాళికాదేవి అమ్మవారి భక్తులు ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (జీఎంఆర్) కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన హామీని నెరవేర్చడం పట్ల అభినందనలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తకోట మండల మాజీ వైస్ ఎంపీపీ వాకిటి బాలరాజు, మాజీ సింగిల్ విండో కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గుంత రమణ, మాజీ సర్పంచ్ పరమేష్, పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు నరుకుల యాదగిరి, వార్డు సభ్యులు వాకిటి కానపురం కొండన్న, నరుకుల కురుమూర్తి, బర్మల రాజు, గ్రామ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మంద కన్నయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గుండ్రాతి సాయిల్ గౌడ్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు కుడికిల్ల నాగేశ్వర్ రెడ్డి, మంద వెంకటన్న, గుండ్రాతి కృష్ణయ్య గౌడ్, మాజీ వార్డు సభ్యులు గణం పరశురాములు, ఆకుల శ్రీనివాసులు, ఎస్సీ సెల్ గ్రామ అధ్యక్షుడు బర్మల రవి, డాక్టర్ సుధాకర్, గొల్ల మల్లేష్, గొల్ల ముంత పర్వతాలు, బీఆర్‌ఎస్ నాయకులు పల్లె ప్రభాకర్ రెడ్డి, అమరచింత శ్రీనివాస్ రెడ్డి, మంద సురేందర్, దూత మన్నెంకొండ, మంద జములన్న లతో పాటు గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!