నీళ్లు రావడం లేదన్న బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ బహిరంగ సవాల్..
బుద్ధారం వద్దకు వచ్చి నీటి ప్రవాహాన్ని కళ్లారా చూడాలి సవాల్ చేసిన కాంగ్రెస్ నాయకులు
పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 10 2026: ప్రెస్మీట్లలో కాదు.. క్షేత్రస్థాయికి వచ్చి వాస్తవాలు తెలుసుకోవాలని డిమాండ్ శ్రీశైలం–కేఎల్ఐ ద్వారా నీళ్లు రావడం లేదంటూ బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారంపై పెద్దమందడి మండల కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను, రైతులను గందరగోళానికి గురిచేసేలా నీటి విషయంలో అసత్య ప్రచారం చేయడం సరికాదని అన్నారు. కేఎల్ఐ నీటి విషయంపై ప్రజలు, రైతుల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆదేశాల మేరకు నిన్న అన్ని మండల కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలకు స్పష్టమైన వివరణ ఇచ్చారని తెలిపారు. కేఎల్ఐ ద్వారా నీటి ప్రవాహంపై వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించామని చెప్పారు. అదే సందర్భంగా పెద్దమందడి మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో బీఆర్ఎస్ మండల కమిటీతో పాటు ఆ పార్టీ నాయకులందరికీ పెద్దమందడి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున బహిరంగ సవాల్ విసిరామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. “రేపు ఉదయం అంటే ఇవాళ 11 గంటలకు లేదా 12 గంటలకు బుద్ధారం గండి కాడికి గానీ, బుద్ధారం చెరువు దగ్గరకు గానీ రండి. నీళ్లు వస్తున్నాయో లేదో మీ కళ్లతోనే చూపిస్తాం. వాస్తవం ఏమిటో మీరే స్వయంగా తెలుసుకోండి” అని బీఆర్ఎస్ నాయకులకు సవాల్ చేసినట్లు పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ విసిరిన బహిరంగ సవాల్‌కు బీఆర్ఎస్ నాయకుల నుంచి ఎలాంటి స్పందన లేదని, సవాల్ స్వీకరించి బుద్ధారం ప్రాంతానికి ఒక్క నాయకుడు కూడా రాలేదని కాంగ్రెస్ నాయకులు అన్నారు. నీళ్లు రావడం లేదంటూ ఆరోపణలు చేస్తున్న నాయకులు, నీళ్లు వస్తున్నాయా లేదా తెలుసుకునేందుకు క్షేత్రస్థాయికి రావడానికి ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. “సవాల్ విసిరినప్పుడు రావడానికి ధైర్యం లేకపోయినా.. మేము మాత్రం ప్రజలకు వాస్తవ పరిస్థితి చూపించడానికి ఇక్కడికి వచ్చాం. ఇప్పుడైనా రండి.. రేపైనా రండి.. ఎప్పుడు వచ్చినా మేము సిద్ధంగా ఉన్నాం” అని కాంగ్రెస్ నాయకులు మరోసారి బీఆర్ఎస్ నాయకులకు బహిరంగ సవాల్ విసిరారు. బుద్ధారం ప్రాంతంలో మరో గంటసేపు తాము అందుబాటులో ఉంటామని, బీఆర్ఎస్ నాయకులు ఎప్పుడు వచ్చినా నీటి ప్రవాహాన్ని స్వయంగా చూపించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కేవలం ప్రెస్మీట్లు పెట్టి, రాజకీయ ప్రకటనలు చేసి ప్రజలను నమ్మించే రోజులు పోయాయని కాంగ్రెస్ నాయకులు అన్నారు. రైతులకు సంబంధించిన సాగునీటి అంశంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, తప్పుడు ప్రచారంతో రైతుల్లో అనవసరమైన ఆందోళన, గందరగోళం సృష్టించడం మానుకోవాలని హెచ్చరించారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి నియోజకవర్గంలోని సాగునీటి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. రైతులకు సాగునీరు అందించేందుకు సంబంధిత అధికారులతో నిరంతరం సమన్వయం చేస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులు ఇకనైనా తప్పుడు ప్రచారాలు మానుకుని వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని, నీటి విషయంలో ఏమైనా అనుమానాలు ఉంటే నేరుగా క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలించాలని కాంగ్రెస్ నాయకులు సూచించారు. ప్రజలను, రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ ప్రతి వాస్తవాన్ని ఆధారాలతో ప్రజల ముందుంచుతుందని స్పష్టం చేశారు.

