ePaper
Thursday, August 13, 2026
📄 ePaper
Homeతెలంగాణముత్తుకూరు జెడ్ హెచ్ డి సి భూములు స్థానిక పేదలకు పట్టాలు ఇవ్వాలి*

ముత్తుకూరు జెడ్ హెచ్ డి సి భూములు స్థానిక పేదలకు పట్టాలు ఇవ్వాలి*

📰 Generate e-Paper Clip

 

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వైయస్సార్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్
అట్లూరు మండలం ముత్తుకూరు రెవెన్యూ గ్రామం లో జెడ్ హెచ్ డి సి భూములు స్థానిక దళితులకు పట్టాలు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దాసరి వెంకటేష్ డిమాండ్ చేశారు.

బుధవారం ఉదయం బద్వేలు ఆర్డిఓ కార్యాలయం ఎదుట వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దాసరి వెంకటేష్ మాట్లాడుతూ ముత్తుకూరు రెవెన్యూ పొలం సర్వేనెంబర్ 763 నుంచి 809 వరకు ప్రభుత్వ భూములు ఎస్సీ కార్పొరేషన్ కింద ఇతర ప్రాంతాల వాళ్లకు కాకుండా గ్రామంలో నివసించే దళితులకు మాత్రమే ఇవ్వాలని డిమాండ్ చేశారు.

 

ముత్తుకూరు దళితులు 40 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్న పట్టాలు ఆన్లైన్లో రైతు భరోసా సౌకర్యం నోచుకోలేదు అని అన్నారు.

కూటమి ప్రభుత్వం సోమశిల నిర్వాసితులైన ముత్తుకూరు దళితులు 40 సంవత్సరాలు నుంచి సాగు చేస్తున్న భూములకు ఆన్లైన్లో పట్టాలు రైతు భరోసా సౌకర్యాలు వెంటనే కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అనంతరం ఆర్డిఓ చంద్రమోహన్ కు వినతి పత్రం సమర్పించారు.

ఈ కార్యక్రమంలో ముత్తుకూరు గ్రామం దళితులు బ్రహ్మయ్య మహేష్ సుబ్బరాయుడు గురువయ్య నరసయ్య లక్ష్మయ్య ప్రసాదు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!