ePaper
Thursday, August 13, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్జ్ఞానజ్యోతి ట్రైనింగును సద్వినియోగం చేసుకోవాలి:

జ్ఞానజ్యోతి ట్రైనింగును సద్వినియోగం చేసుకోవాలి:

📰 Generate e-Paper Clip

కలసపాడు ఆగస్టు 12 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రికపిన్ 9 టివి రిపోర్టర్ ఎం ప్రసాదరావు కలసపాడు. కడప జిల్లా. బద్వేల్ నియోజకవర్గంలోని కలసపాడు మండలం బాయ్స్ హై స్కూల్ నందు అంగన్వాడీ కార్యకర్తలకు జ్ఞాన జ్యోతి 120 రోజుల సర్టిఫికెట్ కోర్సులో భాగంగా, రెండవ సంవత్సరం ట్రైనింగ్ కార్యక్రమం మంగళవారం నాడు‌ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి లుగా పాల్గొన్న కలసపాడు మండల విద్యాశాఖ అధికారులు శ్రీ .పి .యం. ప్రేమ సాగర్, ,శ్రీ. ఎస్ .మస్తాన్వలి మాట్లాడుతూ, భారత ప్రభుత్వం చేపట్టిన నిపుణుభారత్, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన సాల్ట్ ప్రోగ్రాం లో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలకు ట్రైనింగ్ ప్రోగ్రాం జరుగుతుందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని, చెప్పిన అంశాలన్నీ అంగన్వాడి కేంద్రాల్లో అమలు చేయాలని తెలియజేయడం జరిగింది. అనంతరం కార్యకర్తల రిజిస్ట్రేషన్ షెడ్యూల్లో భాగంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రారంభం కావడం జరిగింది.కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు, శ్రీ ఎంవి రమణ , సిడిపిఓ శ్రీమతి లక్ష్మీదేవి , డిఆర్పిలు జీ. వి. సుబ్రహ్మణ్యం, బి. ప్రభాకర్, ఎన్. శివారెడ్డి, సిఆర్పి చెన్న రాయుడులు, అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!