ePaper
Tuesday, August 18, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్కడపసుందరయ్య నగర్ సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన సిపిఎం

సుందరయ్య నగర్ సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన సిపిఎం

📰 Generate e-Paper Clip

డయల్ యువర్ ప్రోగ్రాం నందు సాక్షాత్తు ఎమ్మెల్యే చెప్పిన పరిష్కరించని అధికారులు.

సుందరయ్య నగర్ పట్ల అధికారుల నిర్లక్ష్యం వీడాలి 

సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.శివకుమార్ విమర్శ

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వైయస్సార్ కడప జిల్లా బ్యూరో వెంకటేష్ మైదుకూరు మున్సిపాలిటీ 22,వ వార్డు పరిదిలోని సుందరయ్య నగర్ లో నివాసం ఉంటున్న పేదల సమస్యలను పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి.శివకుమార్ డిమాండ్ చేశారు. సోమవారం సిపిఎం మైదుకూరు మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం ముందు సుందరయ్య నగర్ వాసులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగ ధర్నాను ఉద్దేశించి జి.శివకుమార్ మాట్లాడుతూ… గత9, సంవత్సరాలుగ దాదాపు 100 కుటుంబాలు సుందరయ్య నగర్ నందు ఇల్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారని కాలనీకి మౌలిక సదుపాయాలు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యంగ వ్యవహరిస్తున్నారని వారు విమర్శించారు. కాలనీలో మూడు సంవత్సరాల క్రితం మంచినీటి పైపులైన్ ఏర్పాటు చేశారని ఇంతవరకు మోటార్ కనెక్షన్ ఇవ్వలేదని వారు గుర్తు చేశారు. వర్షాలు వస్తే కాలని మొత్తం జలమయం అవుతుందని కనీసం మట్టి రోడ్లు ఏర్పాటు చేయమని అడిగినా అధికారులు పట్టించుకోవడంలేదని వారు విమర్శించారు. ఇళ్లకు డోర్ నెంబర్లు విద్యుత్ మీటర్లు వీధిలైట్లు, మంచినీటి సౌకర్యం కల్పించాలని ఎన్నిమార్లు అధికారులను అడిగిన సమస్యలను పరిష్కరించడం లేదని వారు ఆరోపించారు. డయల్ యువర్ ఎమ్మెల్యే ప్రోగ్రామ్ నందు సాక్షాత్తు ఎమ్మెల్యే తక్షణమే విద్యుత్ సమస్యను పరిష్కరిస్తామని మట్టి రోడ్లు ఏర్పాటు చేయిపిస్తామని చెప్పి అధికారులకు పురమాయించిన సమస్య పరిష్కారం కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కాలనీ సమస్యలను అధికారులు పరిష్కరించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు అనంతరం మున్సిపల్ చైర్మన్ కు సమస్యలతో కూడిన వెలితి పత్రాన్ని అందజేశారు తన పరిధిలోని సమస్యలను పరిష్కరిస్తారని వారు వాగ్దానం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి షరీఫ్. మండల కమిటీ సభ్యులు గురయ్య ఇమామ్. సుధాకర్ వాసు. నాయకులు లక్ష్మీదేవి. ఓబులేసు హరి.కాలనీవాసులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!